దేశం పేరు మార్పునకు కారణమైన టర్కీ కోడి

Turkey Officially Changes Name at United Nations to Turkiye
x

దేశం పేరు మార్పునకు కారణమైన టర్కీ కోడి

Highlights

*టర్కీని 'తుర్కియె'గా పేరు మార్పు *ఆమేరకు ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదనలు

Turkey: టర్కీ ఇది ఓ పక్షి పేరు మనం టర్కీ కోడిగా పిలుచుకుంటాం. ఇదే పేరిట దేశం పేరు కూడా ఉంది. అయితే ఆ కోడి టర్కీలో పుట్టిన ప్రత్యేక జాతేమో అనుకుంటారు చాలా మంది. కానీ అది నిజం కాదు. ఆ కోడి పేరు టర్కీ ఇప్పుడు ఆ టర్కీ కోడే ఆ దేశానికి తంట తెచ్చింది. తమ దేశం పేరు ఓ పక్షి పేరుతో పోలి ఉండడమేమిటని టర్కీ అధినేత భావించారు. తమ దేశం పేరే మార్చుకోవాలని నిర్ణయించారు. టర్కీని కాస్తా తుర్కియెగా మార్చకున్నారు. తమ దేశాన్ని ఇక నుంచి తురియెగా గుర్తించాలని టర్కీ అధ్యక్షుడు రెచప్‌ టయ్యప్ ఎర్దోవాన్‌ ఐక్యరాజ్య సమితిని కోరారు. ఆమేరకు టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిపాదన పంపింది. ఆ వెంటనే ఐక్యరాజ్య సమితి అగీకారం తెలిపింది. ఇక నుంచి టర్కీని తుర్కియె పిలవాలని అధ్యక్షుడు ఎర్దోవాన్‌ కోరుతున్నారు.

టర్కీ పేరిట పక్షి విషయం ఉన్న విషయాన్ని పక్కన పెడితే టర్కీ అంటే ఫెయిల్యూర్‌, మూర్ఖుడు, సిల్లీఫెలో అని ఇంగ్లిష్‌లో అర్ధాలు ఉన్నాయి. అందుకే టర్కీ పేరును మార్చాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరిలో హలో తుర్కియా పేరుతో ఓ కార్యక్రమాన్ని కూడా అధ్యక్షుడు ఎర్దోవాన్‌ మొదలు పెట్టారు. గతేడాది నుంచే దేశం పేరును మారుస్తున్నట్టు ఎర్దోవన్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా వివిధ అంతర్జాతీయ సంస్థలకు తమ దేశం పేరును మార్చాలంటూ అక్కడి అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే ఆ దేశం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తులపై 'మేడ్‌ ఇన్‌ తుర్కియె'గా మార్చారు. దేశం పేరును విస్తృతంగా ప్రాచూర్యంలోకి తీసుకురావాలని ఎర్దోవన్ ప్రభుత్వం విశ్వప్రయత్నాలను చేస్తోంది.

అయితే దేశం పేరు మార్పుపై రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ఆ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. దీనిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యకత్మవుతోంది. అదే సమయంలో వచ్చే ఏడాది దేశ అధ్యక్ష ఎన్నికలు రానున్నాయి. దీంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎర్దోవన్ ఇలాంటి చర్చలు తీసుకుంటున్నారని ప్రతిపక‌షాలు మండిపడుతున్నాయి. దేశం పేరు మార్చినంత మాత్రాన ఆర్థిక పరిస్థితి మెరగవుతుందా? అంటూ ప్రజలు కూడా మండిపడుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించకుండా ఎర్దోవన్‌ రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత విలువలకు తుర్కియె అనే పదమే సరిగ్గా సరిపోతుందని ఎర్దోవన్‌ ప్రభుత్వం భావించింది. ఆమేరకు దేశం పేరును మార్చుకుంటున్నట్టు తెలిపింది. అయితే ఇలా దేశం పేరు మార్పు ఇదేమీ కొత్త కాదు గతంలోనూ పలు దేశాల పేర్లు మార్పులు జరిగాయి. 2020లో డచ్‌ ప్రభుత్వం హోలాండ్‌ బదులుగా నెదర్లాండ్స్‌ అని పేరు మార్చుకున్నది. మాసిడోనియా కూడా గ్రీస్‌తో ఉన్న గొడవల నేపథ్యంలో నార్త్‌ మాసిడోనియాగా పేరు మార్చుకుంది. గతంలో పర్షియా ఇప్పుడు ఇరాన్ అయింది. సియామ్‌ కాస్త థాయిలాండ్ అయ్యింది. ఇప్పటివరకు ఇలా ఎన్నో దేశాల పేర్లు మార్పులు జరిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories