అనుకున్నదొక్కటి...అయినది ఒక్కటి...

అనుకున్నదొక్కటి...అయినది ఒక్కటి...
x
Highlights

బొద్దింకలు, ఇంట్లో గార్డెన్లో తిరుగుతుంటే చాలు ఎవరైనా ఏం చేస్తారు.

బొద్దింకని చూసినా, దాని పేరు విన్నా చాలు ఒళ్ళంత కంపరంగా వుంటుంది. అలాంటి బొద్దింకలు, ఇంట్లో గార్డెన్లో తిరుగుతుంటే చాలు ఎవరైనా ఏం చేస్తారు. బొద్దింకల మందును స్ప్రే చేస్తారు. కాని బ్రెజిల్ లో ఓ వ్యక్తి చేసిన పని చూస్తే నవ్వు ఆపుకోలేం. అసలు ఆ వ్యక్తి ఏం చేసాడో తెలుసుకుందామా.

సీజర్‌ సీమిజ్‌(48) అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఒక పెద్ద బంగ్లాలో నివసిస్తున్నాడు. ఆ బంగ్లా ముందు హాయిగా కూర్చోవడానికి ఒక గార్డెన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ గార్డెన్లో భారీ సంఖ్యలో బొద్దింకలు చేరడంతో వాటిని చెదరగొట్టమని సీజర్ భార్య అతడికి చెప్పింది. అది విన్న సీజర్ గార్డెన్ లోకి చేరుకున్నారు. బొద్దింకల గూడుపై గ్యాసోలిన్‌ వేసాడు. దానిని అగ్గిపుల్లతో అంటించేందుకు ప్రయత్నం చేసాడు. అది కాస్తా బెడిసికొట్టి ఒక్కసారిగా గార్డెన్ లో పేలుడు సంభవించింది. అంత పేద పేలుడు సంభవించినా బొద్దింకలు చావకపోగా సీజర్‌ కాళ్లపైన పరుగులు పెడుతూ అతడికి చిరాకు తెప్పించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories