Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం..అమెరికా విద్యాశాఖ మూసివేస్తూ కీలక నిర్ణయం


third time president, Donald Trump's key comments, Donald Trump, world news
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం వ్యయం తగ్గించేందుకు ఫోకస్...
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం వ్యయం తగ్గించేందుకు ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగానే ఈ మధ్యే విద్యాశాఖలో భారీగా ఉద్యోగాల్లో కోతలు విధించిన విషయం తెలిసిందే తాజాగా విద్యాశాఖనే మూసివేశారు. గురువారం ఈ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు.
BREAKING: President Trump just signed Executive Order to Eliminate the Department of Education.
— Donald J. Trump Posts From His Truth Social (@TrumpDailyPosts) March 20, 2025
Do you support this? 👍Yes or 👎No pic.twitter.com/Diz3QRHMt2
విద్యా శాఖ పనికిరానిదని, ఉదారవాద భావజాలంతో కళంకితమైందని అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు. కాబట్టి విద్యాశాఖను మూసివేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ విద్యా శాఖను మూసివేయడం అంత సులభం కాదని, కాంగ్రెస్ అనుమతితోనే ఇది సాధ్యమవుతుందని నిపుణులు కూడా అంటున్నారు. కానీ ట్రంప్ దానిని మూసివేయాలని నిశ్చయించుకున్నాడు. అమెరికాలోని ఈ విద్యా విభాగం దాదాపు 45 సంవత్సరాలుగా నడుస్తోంది. ఇది 1979 లో ఏర్పడింది. "అమెరికన్లు ఆధారపడిన సేవలు, కార్యక్రమాలు, ప్రయోజనాల ప్రభావవంతమైన, అంతరాయం లేని డెలివరీని నిర్ధారిస్తూ, విద్యా శాఖను మూసివేయడానికి, రాష్ట్రాలకు విద్యా అధికారాన్ని తిరిగి ఇవ్వడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని" ఈ ఉత్తర్వు విద్యా కార్యదర్శి లిండా మెక్‌మహాన్‌ను నిర్దేశిస్తుంది, అని వైట్ హౌస్ నిజనిర్ధారణ నివేదిక తెలిపింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



