Donald Trump: భారత్, పాక్ యుద్ధ రంగంలో ట్రంప్..ఇరు దేశాలకు ఆఫర్

America News
x

Donald Trump: అరబ్ దేశాల సంపదను చూసి షాక్ అయిన ట్రంప్

Highlights

Donald Trump: పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్ మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత మెరుపుదాడులతో విరుచుకపడిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు దేశాధినేతలు...

Donald Trump: పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్ మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత మెరుపుదాడులతో విరుచుకపడిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు దేశాధినేతలు రాయబారులు దాడుల ఘటనపై స్పందించారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని భారత్, పాక్ లను కోరిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తాజాగా స్పందించారు. ఓవల్ ఆఫీస్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇరుదేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేయడం ఆపాలన్నారు. ఈ సందర్భంగా రెండు దేశాలకు ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. ఇరు దేశాలు తమ విభేదాలను పరిష్కరించుకునేందుకు తాను సహాయం చేస్తానని పేర్కొన్నారు.

భారత్, పాకిస్తాన్ ల మధ్య పరిస్థితి చాలా భయంకరంగా ఉందని..రెండు దేశాల గురించి నాకు చాలా తెలుసు అన్నారు. వాటితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని..వాటిని ఆపేయాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. వారు అనుకుంటే ఇప్పుడే చేసేగలరు. రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వాయి. అమెరికాతోపాటు భారత్, పాకిస్తాన్ కు మంచి సంబంధాల ద్రుష్ట్యా వారికి సహాయం చేయాల్సి వస్తే నేను అందుబాటులో ఉంటాను. ఏ సహాయమైనా చేస్తానని ట్రంప్ అన్నారు.

పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. సుమారు 70 మందికిపైగా టెర్రరిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే భారత్ జరిపిన దాడుల్లో 26 మంది ప్రాణాలను కోల్పోయారని..46 మందికి గాయాలయ్యాయని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఇక భారత దాడులతో సరిహద్దు నియంత్రణ రేఖ వెంట పాక్ బలగాలు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి షెల్లింగ్ కాల్పులతో దాడులను తీవ్రతరం చేసింది. దీంతో 15 మంది భారత పౌరులు మరణించారు. ఒక జవాను కూడా అమరుడయ్యాడు. 43 మంది పౌరులు గాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories