Mumbai Attacks: ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణాను అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్

Mumbai Attacks: ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణాను  అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్
x
Highlights

Mumbai Attacks: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భీకర ఉగ్రదాడిని తలచుకుంటే ఇప్పటికే వణుకుపుడుతుంది. నాటి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణాను భారత్ కు...

Mumbai Attacks: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భీకర ఉగ్రదాడిని తలచుకుంటే ఇప్పటికే వణుకుపుడుతుంది. నాటి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ప్రకటన వచ్చింది. 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్ కు అప్పగిస్తున్నామంటూ ట్రంప్ విలేకరులతో పేర్కొన్నారు. ఈప్రకటనపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ముంబై ఉగ్రదాడి నేరస్థుడిని భారత్ కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిన ట్రంప్ నకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.

తహవూర్ రాణా పాకిస్తాన్ కు చెందిన కెనడా జాతీయుడు. 26/11ముంబై దాడుల్లో కీలక సూతధారి. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనిని తమకు సూత్రధారి. ప్రస్తుతం అతను లాస్ ఏంజెలెస్ జైళ్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతన్ని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్ పోరాటం చేస్తోంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. ఆయా న్యాయస్థానాలు అతని అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని అమెరికా కోర్టు ఆఫ్ అప్పీల్ లోనూ చుక్కెదురైంది. దీంతో చివరి ప్రయత్నంగా గత ఏడాది నవంబర్ 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. దీన్ని కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. 20 పేజీల అఫిడవిట్ ను దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది. అతడిని భారత్ కు అప్పగించేందుకు మార్గం సుగుమం చేసింది. తాజాగా రాణా అప్పగింతపై ట్రంప్ ప్రకటన చేశారు.దీంతో మరికొన్ని నెలల్లోనే అతన్ని భారత్ కు అప్పగించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories