ఆ 6 దేశాలను 'ట్రావెల్ బ్యాన్' లో చేర్చిన ట్రంప్ సర్కార్

ఆ 6 దేశాలను ట్రావెల్ బ్యాన్ లో చేర్చిన ట్రంప్ సర్కార్
x
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవీకాలం ప్రారంభంలో అమల్లోకి తెచ్చిన వివాదాస్పద ట్రావెల్ బ్యాన్ లో ఆరు కొత్త...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవీకాలం ప్రారంభంలో అమల్లోకి తెచ్చిన వివాదాస్పద ట్రావెల్ బ్యాన్ లో ఆరు కొత్త దేశాలను చేర్చారు. డిపార్ట్మెంట్ అఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఎరిట్రియా, కిర్గిజ్స్తాన్, మయన్మార్ మరియు నైజీరియా దేశస్థులకు విదేశీ వీసాలు ఇవ్వడాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది.. అంతేకాదు సుడానీస్ మరియు టాంజానియా జాతీయులపై అదనపు ఆంక్షలు విధించనున్నట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ దేశాలు " సరైన గుర్తింపు నిర్వహణ " లేదా "ప్రాథమిక జాతీయ భద్రత" అవసరాలకు అనుగుణంగా విధానాలను నిర్వహించడంలో విఫలమవుతున్నట్టు వైట్ హౌస్ తెలిపింది.

'ఇది జాతీయ భద్రతకు ప్రాథమికమైనది.. మరియు ఇంగిత జ్ఞానంనకు సంబంధించి. విదేశీయులు అమెరికాకు ప్రయాణించాలి అనుకుంటే ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలను పొందాలనుకుంటే.. ఇంటెలిజెన్స్ నిపుణులు అడిగే ప్రాథమిక భద్రతా పరిస్థితులను సంతృప్తి పరచాలి' వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే ఈ కొత్త ఆంక్షలు పర్యాటకులకు లేదా వ్యాపార ప్రయాణాలకు వర్తించవని వైట్ హౌస్ తెలిపింది. కేవలం యుఎస్‌లో నివసించాలనుకునే వలసదారులకు జారీ చేసే వీసాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొంది. కోర్టు సవాళ్ల తర్వాత.. ట్రంప్ ప్రభుత్వం.. లిబియా, ఇరాన్, సోమాలియా, సిరియా, యెమెన్, ఉత్తర కొరియా మరియు వెనిజులా నుండి వచ్చిన దరఖాస్తుదారులకు వలస మరియు వలసేతర వీసాల జారీని ఇప్పటికే నిలిపివేసింది.

అయితే ట్రంప్ తాజా చర్య ఎన్నికల సంవత్సరంలో మరో న్యాయ పోరాటానికి దారితీస్తుందని విమర్శకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఈ తరహా నిషేధం 17 నెలల రాజకీయ మరియు న్యాయ పోరాటానికి దారితీసింది. ఇందులో ట్రంప్ రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శకులు ఆరోపించారు. ఈ గొడవల కారణంగా నగరాల్లో నిరసనలు , విమానాశ్రయాలలో గందరగోళం నెలకొన్నాయి. దాంతో బాధిత దేశాల నుండి కొంతమంది ప్రయాణీకులను అదుపులోకి తీసుకున్నారు. అనేక సవరణల తరువాత , 2018 లో 5 - 4 ఓట్లపై నిషేధాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories