అఫ్గాన్‌లో పేలుడు.. ఐదుగురు మృతి

అఫ్గాన్‌లో పేలుడు.. ఐదుగురు మృతి
x
Highlights

అఫ్గానిస్తాన్‌ లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన తూర్పు ఆఫ్ఘన్ నగరమైన గార్డెజ్‌లోని కోర్టు సమీపంలో జరిగింది.

అఫ్గానిస్తాన్‌ లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన తూర్పు ఆఫ్ఘన్ నగరమైన గార్డెజ్‌లోని కోర్టు సమీపంలో జరిగింది. పేలుడు పదార్థాలతో ఉన్న ట్రక్ కారణంగా ఈ పేలుడు సంభవించింది. ఘటనలో ఐదుగురు మృతి చెందారు, 14 మంది గాయపడ్డారు. ఈ దాడి వెనక తాలిబన్ల హస్తం ఉందని ఆఫ్ఘన్ అనుమానం వ్యక్తం చేస్తోంది. రెండు రోజుల కిందట ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లోని ఓ ఆసుపత్రిలో ప్రసూతి వార్డుపై ముష్కరులు కాల్పులు జరిపారు.. ఇందులో మహిళలు ,నవజాత శిశువులు సహా 24 మంది మృతిచెందారు.

అంతేకాదు అదే రోజు తూర్పు నాన్‌గాహార్‌లో జరిగిన ఆత్మహుతి దాడిలో 32 మంది మరణించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ తాజా ఘటనకు పాల్పడింది తాలిబన్లే అని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనతో మిలటరీ ఎదురుదాడి విధానాన్ని అవలంబించాలని ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories