ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులు మొత్తం 29 లక్షలు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులు మొత్తం 29 లక్షలు!
x
Representational Image
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 210 దేశాలకు పాకింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 210 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2,921,439 చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 90,722 కేసులు నమోదు కావడంతో ఈ వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందన్నది తెలుస్తోంది.

ఇప్పటివరకు కరోనా బారిన పడి 203,289 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 836,978 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు. అగ్రరాజ్యం అమెరికా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇరాన్, బ్రిటన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక కేసులు(960,896), మరణాలు(54,265) అమెరికాలోనే నమోదయ్యాయి. కాగా, ఇండియాలో ఇప్పటివరకు 26,496 కేసులు నమోదు కాగా.. 825 మృతి చెందారు.

కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల లిస్ట్…

అమెరికా – 960,896 కేసులు, 54,265 మరణాలు

♦ స్పెయిన్ – 223,759 కేసులు, 22,902 మరణాలు

♦ ఇటలీ – 195,351 కేసులు, 26,384 మరణాలు

♦ ఫ్రాన్స్ – 161,488 కేసులు, 22,614 మరణాలు

♦ జర్మనీ – 156,513 కేసులు, 5,877 మరణాలు

♦ బ్రిటన్ – 148,377 కేసులు, 20,319 మరణాలు

♦ టర్కీ – 107,773 కేసులు, 2,706 మరణాలు

♦ ఇరాన్ – 89,328 కేసులు, 5,650 మరణాలు

♦ చైనా – 82,827 కేసులు, 4,632 మరణాలు

♦ ఇండియా – 26,496 కేసులు, 825 మరణాలు


Show Full Article
Print Article
More On
Next Story
More Stories