గడ్డకట్టిన మంచు నీటిలో ఈత కొట్టిన టిక్‌టాక్‌ స్టార్‌

గడ్డకట్టిన మంచు నీటిలో ఈత కొట్టిన టిక్‌టాక్‌ స్టార్‌
x
Jason Clark (File Photo)
Highlights

టిక్‌టాక్.. ప్రస్తుతం ఈ యాప్ గురించి తెలియని వారు దాదాపు లేరనే చెప్పొచ్చు. ఈ చైనా యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వినియోగిస్తున్నారు. టిక్‌టాక్‌...

టిక్‌టాక్.. ప్రస్తుతం ఈ యాప్ గురించి తెలియని వారు దాదాపు లేరనే చెప్పొచ్చు. ఈ చైనా యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వినియోగిస్తున్నారు. టిక్‌టాక్‌ ద్వారా కొందరు తమలోని టాలెంట్‌ను సమాజానికి పరిచయం చేస్తుంటే.. మరికొందరేమో ఫేమ్ కోసం ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఈ కోవలోకి చెందిన వ్యక్తే.. జాసన్ క్లార్క్. పూర్తిగా గడ్డకట్టుకుపోయిన ఓ సరస్సులో ప్రాణాలకు తెగించి ఈత కొట్టాడు. ఊపిరాడక గిలగిలా కొట్టుకున్నాడు. చివరి క్షణంలో దారి దొరకడంతో.. అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

టిక్‌టాక్‌ స్టార్‌ జాసన్‌ క్లార్క్‌ ఓ అడ్వెంచరస్ స్టంట్ చేసి చావు అంచుల్లోకి వెళ్లి వచ్చాడు. అందరిలాగా మామూలు నీళ్లలో ఈత కొడితే మజా ఏముంది అనుకున్నాడో ఏమోగానీ గడ్డ కట్టిన మంచు నీటి కింద ఈత కొట్టాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మంచు గడ్డ కట్టిన నీళ్లలోకి ప్రవేశించి ఈత కొట్టడం ప్రారంభించాడు. తర్వాత కాసేపటికే ఊపిరాడక చేపలా.. గిలగిలా కొట్టుకున్నాడు.

సరస్సులో నుంచి తిరిగి పైకి రావడానికి దారి కూడా కనిపించలేదు. పైగా అతని కళ్లు కూడా మంచు కట్టడం ప్రారంభించమవడంతో ప్రాణం పోవడం తథ్యం అనుకున్నాడు. కానీ ఎట్టకేలకు ఓ రంధ్రం కారణంగా నుంచి బయట పడ్డాడు. ఊపిరి పీల్చుకున్నాడు. చివరి క్షణంలో తనకు దారి దొరక్కపోతే మరణించి ఉండేవాడినని.. ఇకపై ఇటువంటి రిస్క్ చేయనంటూ జాసన్ క్లార్క్ తెలిపాడు. జాసన్ క్లార్క్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 21 మిలియన్ల మందికి పైగా చూశారు.

జాసన్ క్లార్క్.కి టిక్‌టాక్‌ యాప్‌లో దాదాపు 4 లక్షలపైగా ఫాలోవర్స్ ఉన్నారు. మరి కొంతమందిని ఫాలోవర్స్‌గా పొందడం కోసం పెద్ద రిస్కు చేశాడు. చావు అంచుల్లోకి వెళ్లి వచ్చాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories