America: బ్రియాన్‌ బీచ్‌ తీరానికి కొట్టుకొచ్చిన వేలాది చేపలు..!

Thousands Of Fish Wash Up Dead On USA Beach After Being Starved Of Oxygen In Warm Water
x

America: బ్రియాన్‌ బీచ్‌ తీరానికి కొట్టుకొచ్చిన వేలాది చేపలు..!

Highlights

America: సముద్ర ఉపరితలాలు వేడెక్కడంతో ఆక్సిజన్ అందక చేపలు మృతి

America: అమెరికాలోని బ్రియాన్‌ బీచ్‌ తీరానికి వేలాది సంఖ్యలో చేపలు కొట్టుకొచ్చాయి. సముద్రంలో వేలకొద్దీ మెన్‌హడెన్‌ జాతికి చెందిన చాలా చేపలు చనిపోయాయి. అమెరికాలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో సముద్రంలోని చేపలకు సరిపడా ఆక్సిజన్‌ అందక చేపలు మృతిచెందుతున్నాయని అధికారులు చెప్తున్నారు

అయితే నీటి ఉష్ణోగ్రత 70 డిగ్రీల ఫారన్‌హీట్‌ కంటే ఎక్కువగా ఉంటే మెన్‌హెడెన్‌ లాంటి చేపలు ఉష్ణోగ్రతను తట్టుకోలేవు అని అధికారులు చెప్తున్నారు. మెన్‌హెడెన్‌ జాతికి చెందిన చేపలు గుంపుగుంపులుగా జీవనం సాగిస్తాయి. ఒక్కో గుంపులో వందల కొద్దీ చేపలు ఉంటాయి. కెనడా తీరం నుంచి దక్షిణ అమెరికా వరకు ఇవి సంచరిస్తుంటాయి. అయితే నీటి అడుగుభాగం కంటే ఉపరితల జలాలు త్వరగా వేడెక్కుతాయి. ఈ సమయంలో చేపల గుంపు అందులో చిక్కి ఆక్సిజన్ అందక చనిపోతున్నాయి. ఈ రోజు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 90 డిగ్రీల ఫారన్‌హీట్‌గా నమోదైనట్లు అమెరికా జాతీయ వాతావరణ విభాగం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories