దొంగతనానికి వచ్చి.... పారిపోయాడు

దొంగతనానికి వచ్చి.... పారిపోయాడు
x
Highlights

హోటల్‌లో దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు డబ్బు తీసుకోకుండానే ప్రాణభయంతో పరుగులు పెట్టాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

హోటల్‌లో దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు డబ్బు తీసుకోకుండానే ప్రాణభయంతో పరుగులు పెట్టాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని కెంటకీలోని పాడుకలోని ఓ హోటల్ ముసుగు ధరించి ఓ దొంగ ప్రవేశించాడు. దుండగుడు ప్రవేశించిన సమయంలో హోటల్‌లో కేవలం కౌంటర్ లో పనిచేసే మహిళ మాత్రమే ఉంది. నేరుగా ఆమె దగ్గరకు వెళ్లిన దొంగ కౌంటర్‌లోని నగదును తనకు ఇవ్వాలని బెదిరించాడు. మొదట ఆమె నిరాకరించడంతో తుపాకీతో భయపెట్టాడు

దీంతో ఆమె భయపడిపోయి నగదును టేబుల్ పైకి విసిరి కొట్టింది. దానిని దుండగుడు తీసుకుంటున్న సమయంలో తన వద్ద తుపాకీని కౌటర్‌లో పనిచేసే మహిళ ఎదురుగా పెట్టాడు. వెంటనే స్పంధించిన ఉద్యోగిని ఒక్కసారిగా తుపాకీని తన చేతిలోకి అందుకుంది. దుండగుడిపై కాల్పులు జరపడం ప్రారంభించింది. దీంతో భయపడిపోయిన దొంగ పరుగు లంకించుకున్నాడు. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్ని రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో కేవలం కొన్ని రోజుల్లోనే లక్షల మంది వీడియోను చూశారు. దైర్యసాహసాలు చూపినందుకు నెటిజన్లు ఆ మహిళకు అభినందనలు తెలుపుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories