ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బాటిల్ వేలం

The Worlds Largest Bottle Of Whisky Is Now Headed To Auction
x

ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బాటిల్ వేలం

Highlights

Bahubali Whisky Bottle: 5.11 అడుగుల ఎత్తు, 311 లీటర్ల సామర్థ్యం

Bahubali Whisky Bottle: అదొక స్కాచ్‌ విస్కీ బాటిల్‌ 32 ఏళ్ల క్రితం తయారుచేసింది. దాని పేరు ది ఇంట్రెపిడ్‌ ఆ బాటిల్‌ను ఇప్పుడు 12 కోట్ల 47 లక్షల రూపాయలకు వేలం వేయనున్నట్టు స్కాట్లాండ్‌కు చెందిన మాకల్లన్‌ కంపెనీ తెలిపింది. ఒక విస్కీ బాటిల్‌ 12 కోట్ల రూపాయలా? అని ఆశ్చర్యపోతున్నారా? అంత ధర పలకడానికి ఏముంది ప్రత్యేకత? అనేదే కదా మీ ప్రశ్న అయితే ఆ బాటిల్‌ అలాంటి ఇలాంటి బాటిల్ కాదు. అది బాహుబలి బాటిల్‌ అది ఏకంగా మనిషి ఎత్తు ఉంటుంది. అంటే ఐదున్నర అడుగుల 11 అంగులాల ఎత్తు ఉంది. ఆ బాటిల్ సామర్థ్యం 311 లీటర్లు. ప్రపంచంలోనే అతి పెద్ద బాటిల్‌గా రికార్డు సృష్టించి గతేడాది గిన్నీస్‌ బుక్‌లోనూ చాటు సాధించింది. తాజాగా ఈ బాహుబలి బాటిల్‌ మే 25న వేలంకు రానున్నది. దీంతో ఇప్పుడు వార్తల్లోకెక్కింది.

మాకల్లన్‌ కంపెనీ తయారుచేసే 444 రెగ్యూలర్‌ బాటిళ్లు కలిస్తే ఈ బహుబలి బాటిల్‌ నిండుతుంది. అలాంటి ఈ బాటిల్‌ను స్కాట్లాండ్‌ రాజధాని ఎడిన్‌బర్గ్‌కు చెందిన ప్రముఖ వేలంపాట కంపెనీ లైఆన్‌ అండ్‌ టర్నబుల్‌ దీన్ని వేలం వేయనున్నది. ఈ వేలంతో ద్వారా వచ్చిన ఆదాయం మొత్తంలో 25 శాతాన్ని మేరీ క్యూరీ చారిటీకి ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ బాటిల్‌ను రికార్డుల కోసం పదిలంగా దాచుకోవాలని మాకల్లన్ కంపెనీ భావించింది. అయితే ఓ మంచి పనికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు వేలానికి ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ప్రపంచంలో ఓ విస్కీ బాటిల్‌ అధ్యధికంగా 14 కోట్లకు పైగా అమ్ముడయ్యింది. ఆ రికార్డును ఈ బాహుబలి బాటిల్‌ బద్దలు కొట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories