యూఎస్ లో నిరుద్యోగిత రేటు తగ్గుతోంది..

యూఎస్ లో నిరుద్యోగిత రేటు తగ్గుతోంది..
x
Highlights

కరోనావైరస్ కారణంగా ప్రపంచంలో అత్యంత ఘోరంగా ప్రభావితమైన దేశాలలో అమెరికా ముందువరుసలో ఉంది.

కరోనావైరస్ కారణంగా ప్రపంచంలో అత్యంత ఘోరంగా ప్రభావితమైన దేశాలలో అమెరికా ముందువరుసలో ఉంది.. యుఎస్ లో గత మూడు-నాలుగు నెలలుగా ఉద్యోగాలలో భారీ క్షీణతను నమోదు చేసింది. లేబర్ బ్యూరో ప్రకారం, ఏప్రిల్‌లో 20 మిలియన్లకు పైగా ప్రజలు నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగిత రేటు కూడా 14.7% రికార్డు స్థాయికి చేరుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇదే అత్యధికంగా సంఖ్యగా ఉంది.

మే నెలలో నిరుద్యోగిత రేటు 20 శాతం ఉంటుందని ఆర్థికవేత్తలు ఊహించారు, కానీ పరిస్థితి కొంత పుంజుకుంది 'మే'లో అన్ని సమీకరణాలు తారుమారయ్యాయి.. తాజా లేబర్ బ్యూరో నివేదిక ప్రకారం, మే నెలలో నెలలో 30 లక్షలకు పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను తిరిగి పొందారు.

దాంతో నిరుద్యోగిత రేటు కూడా 13.3 శాతానికి పడిపోయింది. అంతేకాదు స్వయం ఉపాధి సంఖ్య కూడా పెరిగింది. మే నెలలో ఇది 40 లక్షల నుండి 79 లక్షలకు పెరిగింది, ఇది దాదాపు రెట్టింపు. అయినప్పటికీ, 1.53 కోట్లకు పైగా ప్రజలు తమ ఉద్యోగాల కోసం ఇంకా వేచి ఉన్నారు. మే మాదిరిగా ఇదే మిగతా నెలలో పెరుగుదల కనిపిస్తే నిరుద్యోగులు కోల్పోయిన తమ ఉద్యోగం పొందడానికి కనీసం 6 నెలలు పడుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories