LPG Price In Pakistan: పాకిస్థాన్‌లో గుది బండ.. ఇదేం సిలిండర్‌ ధరరా నాయన.. ఇంత ఖరీదు అయితే ఎలా బ్రో!

LPG Price In Pakistan: పాకిస్థాన్‌లో గుది బండ.. ఇదేం సిలిండర్‌ ధరరా నాయన.. ఇంత ఖరీదు అయితే ఎలా బ్రో!
x

LPG Price In Pakistan: పాకిస్థాన్‌లో గుది బండ.. ఇదేం సిలిండర్‌ ధరరా నాయన.. ఇంత ఖరీదు అయితే ఎలా బ్రో!

Highlights

LPG Price In Pakistan: భారత్ లో వంట గ్యాస్ (LPG) ధర సోమవారం నుండి సిలిండర్‌కు రూ.50 పెరిగింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్...

LPG Price In Pakistan: భారత్ లో వంట గ్యాస్ (LPG) ధర సోమవారం నుండి సిలిండర్‌కు రూ.50 పెరిగింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. 50 రూపాయల పెంపు కారణంగా, 14.2 కిలోల LPG సిలిండర్ ధర రూ.803 నుండి రూ.853 కి పెరుగుతుంది.

ఉజ్వల యోజన వినియోగదారులకు ఇప్పుడు 14.2 కిలోల సిలిండర్ రూ.503 నుండి రూ.553 కు లభిస్తుంది. 50 రూపాయల పెంపు తర్వాత మన దేశంలో సిలిండర్ ధర 853, కానీ పాకిస్తాన్‌లో గ్యాస్ సిలిండర్ ధర ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అక్కడి ధరలు తెలిస్తే ఇదేం సిలిండర్ ధరా నాయన..ఇంత ఖరీదు ఉందని ముక్కున వేలేసుకుంటారు.

భారత్ లో రూ. 50 పెరగడంతో గ్యాస్ సిలిండర్ ధర రూ. 853కి పెరిగింది. అయితే పాకిస్తాన్‌లో సిలిండర్ ధర భారతదేశంలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఆర్థికంగా దివాలా తీసిన పాకిస్తాన్‌లో, ప్రజలు వంట గ్యాస్ కోసం పోరాడాల్సి వస్తోంది.

పాకిస్తాన్‌లో దేశీయ LPG ధర సిలిండర్‌కు దాదాపు రూ. 3000 నుండి 3500 వరకు ఉంది. మార్చి 2025లో పాకిస్తాన్‌లో LPG గ్యాస్ అధికారిక ధర కిలోకు రూ.247.82. భారతదేశంలో సిలిండర్ బరువు 14.2 కిలోలు, పాకిస్తాన్‌లో సిలిండర్ ధరను లెక్కిస్తే, సిలిండర్‌కు రూ. 3519 అవుతుంది.

పాకిస్తాన్‌లో వాణిజ్య సిలిండర్ ధర ఎక్కువగా ఉంది. 45.4 కిలోల వాణిజ్య సిలిండర్ ధర దాదాపు రూ.11,251.16. అయితే, గ్యాస్ ధర హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంది. పాకిస్తాన్‌లో కూడా మార్చిలో గ్యాస్ ధరలు కిలోగ్రాముకు రూ.6.15 తగ్గాయి. ఆ తర్వాత 11.8 కిలోల సిలిండర్ ధర రూ.2930కి తగ్గింది.

Show Full Article
Print Article
Next Story
More Stories