Pope: పోప్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

Pope: పోప్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
x
Highlights

Pope: పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. శనివారం ఆయనకు తీవ్రమైన శ్వాస సమస్య వచ్చింది. దీంతో అధిక పీడనంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. 88ఏళ్ల...

Pope: పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. శనివారం ఆయనకు తీవ్రమైన శ్వాస సమస్య వచ్చింది. దీంతో అధిక పీడనంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. 88ఏళ్ల పోస్ ఈనెల 14వ తేదీన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో రోమ్ లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. పరీక్షల తర్వాత ఎనీమియా సంబంధిత సమస్యను గుర్తించిన వైద్యులు రక్తాన్ని మార్చారు. శుక్రవారం కంటే శనివారం మరింత కష్టంగా గడిచింది. ఈ సమయంలో ఏమీ చెప్పలేమని వాటికన్ విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది.

న్యూమోనియాతోపాటు సంక్లిష్టమైన శ్వాస ఇన్ఫెక్షన్ తో పోప్ బాధపడుతున్నారని అంతకుముందు వైద్యులు తెలిపారు. మరోవారం ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందన్నారు. అయితే వాటికన్ మాత్రం ఆరోగ్యం విషమంగా ఉందని ప్రకటించింది. ఆయన ప్రమాదం నుంచి బయటపడలేదని వ్యక్తిగత ఫిజీషియన్ లూగీ కార్బొన్ తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన బాగానే నిద్ర పోయారని వెల్లడించారు. దక్షిణార్థగోళం నుంచి పోప్ అయిన తొలి వ్యక్తి ఫ్రాన్సిస్. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో 1936లో జన్మించిన ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్ 16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చికి అధిపతి అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories