America: పిల్లల్ని వరుసలో నిలబెట్టి కాల్చేసిన తండ్రి..

The Father Who Shot The Children In A Row
x

America: పిల్లల్ని వరుసలో నిలబెట్టి కాల్చేసిన తండ్రి..

Highlights

America: అమెరికాలో తుపాకీ సంస్కృతి విలయం కొనసాగుతోంది

America: అమెరికాలో తుపాకీ సంస్కృతి విలయం కొనసాగుతోంది. ఏకంగా కన్నతండ్రులే తమ బిడ్డల్ని కాల్చిచంపడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒహాయో, టెన్నెసీ, బాల్టిమోర్‌లలో తాజాగా ఈ వరుస ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒహాయోలోని చాడ్‌ డోయెర్‌మాన్‌ దంపతులకు ఒక కూతురు, ముగ్గురు కొడుకులు ఉన్నారు. వీరంతా ఏడేళ్ల లోపువారు.

వారందరినీ ఇంటి పెరట్లో వరుసగా నిలబడమన్నాడు. తండ్రి చెప్పినట్టుగా పిల్లలు వరుసగా నిలబడ్డారు. వెంటనే వారిపై తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఇద్దరు కుమారులు అక్కడికక్కడే కుప్పకూలగా, మరో కుమారుడు, కుమార్తె భయంతో వీధిలోకి పరుగులుతీశారు. పారిపోతున్న కొడుకును వెంటపడి పట్టుకుని తిరిగి పెరట్లోకి తీసుకొచ్చి కాల్చిచంపాడా తండ్రి. అడ్డుకున్న భార్యపైనా కాల్పులు జరిపాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ గాయాలతోనే ఆమె పోలీసులకు ఫోన్‌ చేసింది.

నిందితుడిని అధికారులు అదుపులోకి తీసుకుని, అతని భార్యను అస్పత్రికి తరలించారు. బాలికను రక్షించారు. మరో ఘటనలో. టెన్నెసీలో సికాచీలో గారీ బర్నెట్‌ అనే వ్యక్తి తనకు దూరంగా ఉంటున్న భార్యను, ఆమె కూతురును, మరో ముగ్గురు పిల్లలను, గుర్తుతెలియని వేరే వ్యక్తిపైనా విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. కాల్పుల అనంతరం బర్నెట్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories