అమెరికాలో ఆవు పిడకలకు భలే డిమాండ్

అమెరికాలో ఆవు పిడకలకు భలే డిమాండ్
x
Highlights

భారత దేశంలో ఆవును గోమాతగా పూజిస్తారు. అంతేకాదు ఆవు పేడతో పిడకలు చేసి, భద్రపరుస్తుంటారు. ఆవు మూత్రాన్ని కూడా పవిత్రంగా భావించి ఇంటిని శుద్ధి...

భారత దేశంలో ఆవును గోమాతగా పూజిస్తారు. అంతేకాదు ఆవు పేడతో పిడకలు చేసి, భద్రపరుస్తుంటారు. ఆవు మూత్రాన్ని కూడా పవిత్రంగా భావించి ఇంటిని శుద్ధి చేసుకోవడానికి వాడతారు. భారతీయులు తరుచూ పూజల్లో వాడే ఈ పిడకలు ఇప్పుడు అమెరికాలో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయంట. అమెరికాలోని న్యూ జెర్సీలో ఈ ఆవు పిడకలను ఓ సూపర్ మార్కెట్లో పెట్టి అమ్ముతున్నారు. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.

అమెరికాలో ఈ ఆవు పిడకల బిజినెస్ జోరుగా సాగుతుంది. ఒక్క ప్యాకెట్ కి కేవలం రూ.215 మాత్రమేనట. ఆ ప్యాకెట్లో కూడా 20 పిడకలో 30 పిడకలో ఉంటాయనుకునేరు. అందులో కేవలం 10 పిడకలు మాత్రమే ఉంటాయంట. అంతే కాక ఈ పిడకల ప్యాకెట్ పైన ఏంరాసుందంటే అవి తినే కేకులు కాదు కేవలం పూజకు వాడేవి మాత్రమే అని క్యాప్షన్ కూడా ఉందంట. దీంతో కొంతమంది వినియోగదారులు ఆ ప్యాకెట్ల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు కాస్త ఇప్పుడు నెటిజన్ల ఫోన్ లలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన కొంత మంది మాత్రం అమెరికాలో ఆవు పిడకల బిజినెస్ చేసుకుని బతుకొచ్చు అంటూ కామెంట్లు కొడుతున్నారు. ఇదే కోణంలో ఈ మధ్య కాలంలో అమెజాన్ వాళ్లు రెండు కొబ్బరి చిప్పలను 1400కి అమ్మి కొనుగోలు దారులకు షాక్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories