బాలుడి అంతిమ యాత్రలో 2100 స్పోర్ట్స్ కార్లు, 70 బైకులు

బాలుడి అంతిమ యాత్రలో 2100 స్పోర్ట్స్ కార్లు, 70 బైకులు
x
అంతిమ యాత్రలో పాల్గోన్న కార్లు
Highlights

14 ఏళ‌్ల బాలుడి చివరి కోరికను తీర్చడానికి ఏకంగా 2100 స్పోర్ట్స్ కార్లు, 70 అత్యాధునిక బైకులు తరలి వచ్చాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ అది నిజం...

14 ఏళ‌్ల బాలుడి చివరి కోరికను తీర్చడానికి ఏకంగా 2100 స్పోర్ట్స్ కార్లు, 70 అత్యాధునిక బైకులు తరలి వచ్చాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ అది నిజం అమెరికాలోని మిస్సౌరీకి చెందిన అలెక్ ఇంగ్రామ్ అనే 14 ఏళ్ల బాలుడికి ఆస్టియోసర్కోమా అనే అరుదైన బోన్ క్యాన్సర్ వచ్చింది. నాలుగేళ్లకు పైగా క్యాన్సర్ తో పోరాడిన ఆ బాలుడు నవంబరు 7న మరణించాడు. చనిపోయిన అలెక్ కు స్పోర్ట్స్ కార్లన్నా, బైకులన్నా చాలా ఇష్టం. దీంతో తన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో స్పోర్ట్స్ కార్లు, బైకులు పాల్గొనాలన్నది బాలుడి చివరికోరిక. ఆ కోరిక గురించి అలెక్ కుటుంబ సభ్యులకు అందరికీ తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న సిడ్నీస్ సోల్జర్స్ ఆల్వేస్ అనే సంస్థ అంతిమ యాత్రలో పాల్గొనడానికి ముందుకొచ్చింది. అంతేకాదు స్పోర్ట్స్ కార్స్ ఫర్ అలెక్ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ పిలుపుతో కుర్రాడి చివరికోరిక తీర్చేందుకు 2100 స్పోర్ట్స్ కార్లు, 70 అత్యాధునిక బైకులు వాషింగ్టన్ లోని మిస్సౌరీ చేరుకున్నాయి. ఆ బాలుడి అంతిమ యాత్రలో పాల్గొన్న కార్లు, బైక్ లకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories