దూసుకొస్తున్న అతి పెద్ద మంచుముక్క.. ఆ ద్వీపానికి ముంచుకొస్తున్న ప్రమాదం!

దూసుకొస్తున్న అతి పెద్ద మంచుముక్క.. ఆ ద్వీపానికి ముంచుకొస్తున్న ప్రమాదం!
x

Iceberg near south georgia (image source:aljazeera)

Highlights

ఓ భారీ మంచుకొండ ఇప్పుడు ఒక దీవిని ఢీ కొట్టబోతోంది. పరిశోధకులు ఈ మంచుకొండ గమనాన్ని అంచనావేసి తరువాత అది ఎక్కడ భూ భాగాన్ని ఢీ కొట్టబోతోందో చెప్పారు.

మంచు కొండలు విడిపోయి ముక్కలు కావడం.. అవి సముద్రంలో కొంత దూరం ప్రయాణించి కరిగిపోవడం సాధారణం. కానీ, కొన్ని మాత్రం ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అటువంటి ఓ భారీ మంచుకొండ ఇప్పుడు ఒక దీవిని ఢీ కొట్టబోతోంది. పరిశోధకులు ఈ మంచుకొండ గమనాన్ని అంచనావేసి తరువాత అది ఎక్కడ భూ భాగాన్ని ఢీ కొట్టబోతోందో చెప్పారు. దీని ప్రకారం ఇది కచ్చితంగా బ్రిటన్‌కు చెందిన ఓ దీవిని ఢీకొట్టే అవకాశం ఉందని తేల్చారు.

ఎక్కడిదీ మంచుముక్క?

ఈ మంచుముక్క సముద్రంలో మూడేళ్ళుగా చక్కర్లు కొడుతోంది. ఇది దక్షిణ ధృవంలోని అంటార్కిటికా లోని లార్సెన్ సీ ప్రాంతం నుంచి విడిపోయింది. ఇది అప్పట్లో చాలా పెద్దది. అయితే, తరువాత ఇది మూడు ముక్కలుగా విడిపోయింది. 2017లో ఇది జరిగింది. మొదట్లో ఇది ప్యారిస్ నగరానికన్నా 50రెట్లు పెద్దది. దీనికి ఏ68 అని పేరుపెట్టారు. సముద్రంలో ప్రయాణించే క్రమంలో కొంతకాలానికి ఇది మూడుముక్కలుగా విడిపోయింది .పెద్దగా ఉన్నపుడు దీనికి ఏ-68 అని పేరు పెట్టారు కదా. తరువాత ఈ మంచు కొండ ముక్కలు అయ్యాకా దీనిలో అతిపెద్ద ముక్కకు ఏ-68ఏ గానూ మిగిలిన వాటికీ ఏ-68బి, ఏ-68సి గానూ పేర్లు పెట్టారు. ఈ ఏ-68ఏ మంచుముక్క ప్రపంచంలోనే అతిపెద్దది. దీని పొడవు 150కిలోమీటర్లు, వెడల్పు 48కిలోమీటర్లు. ప్రస్తుతం ఇది ఐస్‌బర్గ్ వ్యాలీ అనే ప్రాంతంలో ఉంది. నెమ్మదిగా సౌత్ జార్జియా ద్వీపంవైపు ప్రయాణిస్తోంది. (source:aljazeera)

ప్రమాదం ఏమిటి?

అట్లాంటిక్ మహాసముద్రంలోనే ఉన్న జార్జియా దీవిని ఈ మంచుముక్క ఢీ కొట్తచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే, ఈ ప్రాంతంలో మనుషులు పెద్దగా ఉండకపోయినా పెంగ్విన్ల వంటి మంచులో బ్రతికే జీవులు చాలానే ఉన్నాయి. ఇప్పుడు గనుక ఏ-68ఏ వచ్చి దీవిని ఢీకొంటే ఈ జీవుల జీవనం బాగా దెబ్బతింటుంది. ఢీకొట్టిన సమయంలోనే చాలా జీవులు చనిపోయే ప్రమాదముంది. అలాగే జంతువులు ఆహారం సంపాదించుకునే మార్గాలను కూడా ఈ మంచుముక్క అడ్డుకుంటుంది. దీంతో ఆహారం కోసం కూడా ఇక్కడి జీవులు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడుతుంది.

సౌత్ జార్జియా అట్లాంటిక్ సముద్రంలో, దక్షిణ అమెరికాకు చేరువలో ఉన్న ఓ ద్వీపం. బ్రిటన్‌కు చెందిన ఈ దీవి మత్స్యరంగంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పుడుగనుక ఏ-68ఏ దీన్ని ఢీకొంటే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన బ్రిటన్ శాస్త్రవేత్తలు.. ఏ-68ఏ ప్రయాణ మార్గాన్ని గమనించడం కోసం ఉపగ్రహ చిత్రాలను సేకరిస్తున్నారు. ఆ చిత్రాల ప్రకారం ఈ మంచుముక్కలో చాలా చీలికలు ఉన్నాయి. కానీ ఇది విడిపోకుండా సౌత్ జార్జియా వైపు దూసుకొస్తోంది. ఇది గనుక సౌత్ జార్జియాను ఢీకొంటే అక్కడే కనీసం 10ఏళ్లు అతుక్కుపోతుందని శాస్త్రవేత్తల అంచనా. అదే జరిగితే ఈ దీవిలోని జీవరాశితోపాటు చేపల వ్యాపారం కూడా దెబ్బతింటుందని సమాచారం. వేగంగా వీస్తున్న గాలుల కారణంగానే ఈ మంచుముక్క సౌత్ జార్జియావైపు ప్రయాణిస్తున్నట్లు అంచనా. ఏదోఒకటి చేసి ఈ ప్రమాదం నుంచి తమ దీవిని కాపాడుకోవాలని బ్రిటన్ భావిస్తోంది. దానికోసం విస్తృతంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories