723 సంవత్సరాల జైలు శిక్ష!

723 సంవత్సరాల జైలు శిక్ష!
x
Highlights

ఒకటి కాదు రెండు కాదు.. రెస్టారెంట్లకు చెందిన ఓనర్లకు ఏకంగా 723 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు.

ఒకటి కాదు రెండు కాదు.. రెస్టారెంట్లకు చెందిన ఓనర్లకు ఏకంగా 723 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ఘటన థాయిలాండ్‌లో జరిగింది. రెండు రెస్టారెంట్లకు చెందిన ఓనర్లకు అక్కడి స్థానిక కోర్టు 723 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో జనం ఆశ్చర్యానికి గురయ్యారు. మనిషి జీవితం మహా అయితే వంద సంవత్సరాలు. అలాంటప్పుడు 723 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించడం ఎలా సాధ్యం అని అనుకుంటున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. థాయిలాండ్‌కు చెందిన అపికార్ట్ బోవోర్బంచారక్, ప్రపాసార్న్ బోవోర్బాన్ రెస్టారెంట్లు 2019 సెప్టెంబర్‌లో తమ వద్దకు వచ్చే కస్టమర్లకు వోచర్లు కొనుగోలు చేస్తే డిస్కౌంట్‌ ఇస్తామని ప్రకటించారు. దాంతో కస్టమర్లు పెద్దఎత్తున వోచర్లను కొనుగోలు చేశారు. అయితే వోచర్లను కోలుగోలు చేసిన తరువాత కస్టమర్లు ఆ రెస్టారెంట్లకు వద్దకు వెళితే అవి చెల్లవంటూ వాటి ఓనర్లు చేతులెత్తేశారు.

దీంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రెండు రెస్టారెంట్ల ఓనర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అప్పటి నుంచి స్థానిక కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో మొదట వారికి 1446 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. దాంతో షాక్ తిన్న యజమానులు.. తాము చేసింది తప్పేనని ఒప్పుకోవడంతో వారి శిక్షను 723 సంవత్సరాలకు కుదిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అంతేకాదు 58,500 డాలర్ల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పు విన్న థాయిలాండ్ ప్రజలు ఆశ్చర్యపోయారు. నిజానికి ఆ దేశ చట్టాల ప్రకారం ఓ వ్యక్తి 20 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత బయటకు విడుదల అయ్యే వెసులుబాటు ఉంటుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories