Coronavirus: క్రూయిజ్ షిప్‌లో పది మందికి కరోనావైరస్ పాజిటివ్

Coronavirus: క్రూయిజ్ షిప్‌లో పది మందికి కరోనావైరస్ పాజిటివ్
x
Highlights

జపాన్ తీరంలోని ఓ క్రూయిజ్ షిప్‌లో ప్రయాణిస్తోన్న మరో పది మందికి కొత్తగా కరోనావైరస్ పాజిటివ్ లక్షణాలు తేలాయి. ఈ విషయాన్నీ స్థానిక మీడియా గురువారం...

జపాన్ తీరంలోని ఓ క్రూయిజ్ షిప్‌లో ప్రయాణిస్తోన్న మరో పది మందికి కొత్తగా కరోనావైరస్ పాజిటివ్ లక్షణాలు తేలాయి. ఈ విషయాన్నీ స్థానిక మీడియా గురువారం (ఫిబ్రవరి 6) తెలిపింది. ఓడలో సిబ్బందితో కలిపి సుమారు 3,700 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారిలో 273 మందిని జపాన్ అధికారులు పరీక్షించారని.. దాంతో పదిమందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలిందని పేర్కొంది. దీంతో కార్నివాల్ యాజమాన్యంలో ప్రిన్సెస్ క్రూయిజ్ ఓడ రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంటుందని స్పష్టం చేశారు.. అంతేకాదు ఎనిమిది రోజుల రౌండ్ ట్రిప్ కూడా రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.

జపాన్ యొక్క దక్షిణ ఒకినావా ప్రిఫెక్చర్లోని నహా లోని ఓడరేవు వద్ద శనివారం క్రూయిజ్ షిప్ ను నిర్బంధించారు. గత నెలలో హాంకాంగ్‌ పడవలో ప్రయాణిస్తున్న వ్యక్తి అస్వస్థతకు లోనయ్యాడు.. దాంతో అతనికి పరీక్షలు చేయడంతో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. ఈ క్రమంలో ఈ పడవలో కూడా కరోనా లక్షణాలు కనిపించడంతో జపాన్ అధికారులు క్రూయిజ్ షిప్‌ను నిర్బంధించారు. ఓడలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మరియు సిబ్బంది 14 రోజుల పాటు నిర్బంధంలో ఉండవలసి ఉంటుందని జపాన్ ఆరోగ్య మంత్రి కట్సునోబు కటో చెప్పారు.

కొత్త వైరస్ కు రెండు వారాల వరకు వృద్ధి చెందే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో నిర్బంధంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. 'మేము దిగ్బంధం ప్రక్రియను కొనసాగిస్తున్నప్పుడు సంక్రమణను నివారించే విధంగా ప్రయాణికులు సహకరించాలని కోరుతున్నామని' కటో తెలిపారు.

ఇక ఈ క్రూయిజ్ ఆపరేటర్ ఓడలో ప్రయాణిస్తున్న సగం మంది ప్రయాణికులు జపాన్ కు చెందిన వారు కాగా.. మిగిలినవారు ఇతర ప్రాంతాల నుండి వచ్చినవారు వారు. అయితే వారి జాతీయతలపై వివరాలు ఇంకా లభ్యం కాలేదు. ఇదిలావుంటే ఫిబ్రవరి 4 , 12 తేదీలలో యోకోహామా నుండి బయలుదేరాల్సినమరో రెండు డైమండ్ ప్రిన్సెస్ షిప్ లను కూడా అధికారులు రద్దు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వేచి ఉండాలని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories