వాట్సాప్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు

వాట్సాప్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు
x
Highlights

వాట్సాప్ పై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పరేల్ దురోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ వినియోగదారుల మొబైల్ డేటాను దొంగిలిస్తోందన్నారు.

వాట్సాప్ పై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పరేల్ దురోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ వినియోగదారుల మొబైల్ డేటాను ఆ సంస్థ దొంగిలిస్తోందని ఆరోపించారు. అందుకోసం వాట్సాప్ ఓ ట్రోజాన్ కూడా ఉపయోగిస్తుందని దురోవ్ తన టెలిగ్రాం అకౌంట్‌లో పోస్ట్ చేశారు. వాట్సాప్ యాప్ ఉంటే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయాలి సూచించారు.

ఫేస్ బుక్ కొనుగోలు చేయకముందే వాట్సాప్ తమ వినియోగదారుల డేటాను విక్రయించామన్న యాజమాన్యం వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాస్ వినియోగదారులు సంఖ్య 160 కోట్లపైగా ఉంది. టెలిగ్రామ్ ను 20 కోట్ల మంది వినియోగిస్తున్నారు. అయితే టెక్ నిపుణులు మాత్రం టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు దురోవ్ వ్యాఖ్యలు కొట్టిపారేస్తున్నారు.

వాట్సాప్ వినియోగదారులు ఎక్కువగా ఉండడంతో హ్యాకింగ్ గురవుతోందని, దానిపై గత కొన్ని రోజులుగా అనేక సైబర్ దాడులు జరిగాయని అందుకే దురోవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే వాట్సాప్ తన వినియోగదారులను యాప్ అప్ డేట్ చేసుకోవాల్సిందిగా కోరింది. ఎంపీ 4 ఫైల్స్ ఎవరైనా పంపిస్తే వాటిని ఓపెన్ చెయోద్దని కోరింది. ఎంపీ4పైల్స్ ద్వారా హ్యాకర్లు మొబల్ డేటాను దొగిలిస్తున్నారని అభిప్రాయపడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories