ట్రంప్ టారిఫ్ బెదిరింపులు: భారత్ ముందున్న ఆప్షన్లు ఏంటి?

tariff and tax foreign countries says trump Trouble for India?
x

ట్రంప్ టారిఫ్  బెదిరింపులు: భారత్ ముందున్న ఆప్షన్లు ఏంటి?

Highlights

అమెరికా అధ్యక్ష బాధ్యతలను డోనల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆయన చేసిన ప్రసంగంలో కీలక విషయాలు వెల్లడించారు.

అమెరికా అధ్యక్ష బాధ్యతలను డోనల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించారు. అమెరికాను ముందుకు తీసుకెళ్లేందుకు విదేశీ వస్తువులపై సుంకాలు, పన్నులు విధిస్తానని ప్రకటించారు. అమెరికా వాణిజ్య వ్యవస్థను వెంటనే సరిదిద్దుతానని ఆయన చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గ్లోబల్ దిగుమతులపై 10 శాతం, చైనా వస్తువులపై 60 శాతం, కెనెడియన్, మెక్సికన్ ఉత్పత్తులపై 25 శాతం దిగుమతి సర్‌చార్జి విధిస్తున్నట్లు రాయిటర్స్ నివేదించింది. కెనడా, మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమ వలసలను ఆపడంలో, డ్రగ్స్ కార్టెల్స్‌పై కఠినంగా వ్యవహరించడంలో విఫలమైతే ఈ దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.ఇతర దేశాలపై టారిఫ్ పన్ను వాణిజ్య విధానాన్ని అమలు చేస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. కొన్ని అమెరికా ఉత్పత్తులపై పన్ను విధిస్తున్న భారతదేశం వంటి దేశాలు పన్ను విధిస్తున్నాయి.

భారత్‌పై ట్రంప్ టారిఫ్ బెదిరింపులు

అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్నందుకు భారతదేశంతో సహా దేశాలపై ట్రంప్ గతంలో పదే పదే విమర్శలు చేశారు. భారత్ వంటి దేశాలు అమెరికా వస్తువులపై అధిక సుంకాలను వసూలు చేస్తే వాషింగ్టన్ కూడా భారత దిగుమతులపై అదే విధమైన సుంకాలను విధిస్తుందని ఆయన హెచ్చరించారు.అమెరికా ఉత్పత్తులపై భారత్ 100 నుంచి 200 శాతం పన్ను వసూలు చేస్తుందని గత డిసెంబర్ లో ఆయన చెప్పారు. అమెరికా ఫస్ట్ అనే లక్ష్యంతో తన విధానాలు ఉంటాయని ట్రంప్ ప్రకటించారు. తన విధానాలు అమెరికాను వాణిజ్యపరంగా ఉత్పాదక దేశంగా మారుస్తాయని ట్రంప్ చెప్పారు.

బ్రిక్స్ కరెన్సీ'పై ట్రంప్ టారిఫ్ హెచ్చరిక

గత ఏడాది డిసెంబర్‌లో అమెరికా డాలర్‌కు పోటీగా మరో కరెన్సీని తీసుకు రావడానికి ప్రయత్నించిన భారత్‌తో సహా బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరించారు.అక్టోబరులో రష్యాలోని కజాన్‌లో కూటమి సభ్యులు డాలర్‌యేతర లావాదేవీలను పెంచే విషయమై చర్చించిన తర్వాత బ్రిక్స్ దేశాలకు ట్రంప్ 100 శాతం పన్ను విధిస్తామని చెప్పారు.

ట్రంప్ వార్నింగ్ పై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. బ్రిక్స్ సభ్యదేశాలు వారి స్వంత కరెన్సీలను ఉపయోగించడం ద్వారానే ఎక్కువ వ్యాపారాలు చేస్తాయని ఆయన అన్నారు.2021-2022, 2022-2023లో అమెరికా, భారతదేశం అగ్ర వాణిజ్య భాగస్వామి. అయితే 2023-2024లో చైనా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది.2024 జనవరి-జూలై లో ద్వైపాక్షిక వస్తువుల వ్యాపారం 72 బిలియన్లను అధిగమించింది. భారతీయ ఎగుమతులు 48.2 బిలియన్లకు పెరగడంతో భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా తిరిగి తన స్థానాన్ని పొందింది.

ట్రంప్ టారిఫ్ వార్ వల్ల భారతదేశం ప్రభావం ఎంత?

ట్రంప్ పరస్పర సుంకాల హెచ్చరిక భారతదేశ ఎగుమతి రంగాన్ని, ముఖ్యంగా అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడే పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. భారతీయ ఎగుమతిదారులు అధిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.దీంతో వారి ఉత్పత్తులకు పోటీ తక్కువగా ఉంటుంది.ఇది భారతీయ వ్యాపారాలకు అమ్మకాలు ఆదాయాన్ని తగ్గించడానికి దారితీయవచ్చు. ఇది దేశంలో ఉపాధి, ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.ఈ టారిఫ్‌ల ఆర్థిక ప్రభావం వాణిజ్య నిల్వలకే పరిమితం కాదు. ఇది రెండు దేశాలలో వినియోగదారుల ధరలను పెంచే అవకాశం కూడా ఉంది.దిగుమతుల ధరను పెంచడంతో అమెరికా కంపెనీలు ఈ అధిక ఖర్చులను వినియోగదారులపై వేసే అవకాశం ఉంది. ఇది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది.

అదేవిధంగా భారతీయ వినియోగదారులు అమెరికా నుండి దిగుమతి చేసుకున్న వస్తువులకు అధిక ధరలకు లభ్యమౌతాయి. ఇది భారతీయుల జేబులను ఖాళీ చేయనుంది. ట్రంప్ విధానాలపై భారత్ కూడా తన వాణిజ్య విధానాలను పున:పరిశీలించాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories