ఆఫ్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలు మొదలు పెట్టిన తాలిబన్లు

Talibans Started Discussions to Form a New Government of Afghanistan | Taliban News Today
x

ఆఫ్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలు మొదలుపెట్టిన తాలిబన్లు

Highlights

Taliban's: మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌తో తాలిబన్ల భేటి, శాంతియుతంగా అధికార బదిలీ జరగాలని కర్జాయ్‌ ప్రతిపాదన

Taliban's - Afghanistan New Government: ఆఫ్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఆ దిశగా తాలిబన్లు చర్చలకు పూనుకున్నారు. తాలిబన్‌ సీనియర్‌ నాయకుడు అనాస్‌ హక్కానీ, అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌తో భేటి అయ్యారు. శాంతియుతంగా అధికార బదిలీ జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరగాలని కర్జాయ్‌ ప్రతిపాదించారు. అనాస్‌తో భేటీ ప్రాథమిక చర్చల్లో భాగమని కర్జాయ్‌ ప్రతినిధి వెల్లడించారు.

ఇదిలా ఉండగా తాలిబన్ల రాజకీయ విభాగం సీనియర్‌ నేత ముల్లా అబ్దుల్‌ ఘనీ, బరాదర్‌తో భేటీ కానున్నారు. అన్ని పక్షాలను కలుపుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దిశగా తాలిబన్లు చర్చలు మొదలుపెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories