Afghanistan: ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల ఆటవిక పాలన

Afghanistan: వాలీబాల్ క్రీడాకారిణి మహ్జాబిన్ హకీమి హత్య

Sandeep Eggoju
Published on: 20 Oct 2021 7:54 PM IST
Taliban Beheaded the Afghanistan Womens National Team Junior Volleyball Player
X
ఆఫ్గనిస్తాన్ వాలీబాల్ ప్లేయర్ ను చంపినా తాలిబన్లు (ఫైల్ ఇమేజ్)

Afghanistan: ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు ఆటవిక పాలన కొనసాగిస్తున్నారు. కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారు. మహిళలను క్రీడలు ఆడొద్దని హెచ్చరించిన తాలిబన్లు కొద్ది రోజుల క్రితమే అండర్ 19 జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి మహ్జాబిన్ హకీమిని దారుణంగా హత్య చేశారు. ఆమె తల నరికి పాశవికంగా హతమార్చారు. ఈ నెల ప్రారంభంలో ఈ ఘటన జరిగినా ఆ జట్టు కోచ్ వెల్లడించడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది.

అష్రఫ్ ఘనీ ప్రభుత్వం కూలిపోయే ముందు వరకు కాబుల్ మున్సిపాలిటీ వాలీబాల్ క్లబ్‌కు మహ్జాబిన్ హకీమి ప్రాతినిధ్యం వహించింది. ఉత్తమ ప్లేయర్‌గానూ గుర్తింపు పొందింది. అయితే ఆఫ్గన్‌ను ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు మహిళా క్రీడాకారులపై దృష్టి సారించారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారిణులను లక్ష్యంగా చేసుకుని వారిని కిరాతకంగా హతమారుస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story