Sweden: స్వీడన్‌లో దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళకు ప్రధాని పగ్గాలు

Swedens First Female Prime Minister Quits Hours Later
x

స్వీడన్ తొలి మహిళా ప్రధాని మగ్దలీనా అండర్సన్‌ (ఫైల్ ఇమేజ్)

Highlights

Sweden: మగ్దలీనా అండర్సన్‌‌కు దేశ పాలన పగ్గాలను అప్పగిస్తూ పార్లమెంటు ఆమోదం

Sweden: యూరప్ దేశమైన స్వీడన్‌లో బుధవారం దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళకు ప్రధాని పగ్గాలు అప్పగించడం.. కొద్ది గంటల్లోనే ఆమె రాజీనామా చేయడం వంటి పరిణామాలు చకచకా చోటు చేసుకున్నాయి. మగ్దలీనా అండర్సన్‌ కు దేశ పాలన పగ్గాలను అప్పగిస్తూ పార్లమెంటు ఆమోదం తెలిపింది. దేశ ఆర్థిక మంత్రి, సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ నేతగా ఇటీవల ఎన్నికైన అండర్సన్‌ అరుదైన ఘనతను దక్కించుకున్నారంటూ అంతర్జాతీయంగా ప్రశంసలు కూడా అందుకున్నారు. కొద్ది గంటల్లోనే పార్లమెంటులో ఓ బడ్జెట్‌ ఓడిపోవడం, రెండు పార్టీలతో కూడిన మైనారిటీ ప్రభుత్వం నుంచి ఓ సంకీర్ణ భాగస్వామి వైదొలగడంతో ఆమె రాజీనామా చేశారు. ''ఈ బాధ్యత గౌరవప్రదమే అయినా ఉనికి ప్రశ్నార్థకమయ్యే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించాలని నేను కోరుకోవడం లేదని ఆమె చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories