చందమామ అందాలు.. మరింత ప్రకాశంగా కనిపించేది రేపే!

చందమామ అందాలు.. మరింత ప్రకాశంగా కనిపించేది రేపే!
x
Representation Image
Highlights

ప్రపంచం లాక్ డౌన్ అయిపొయింది. ఇంటిలోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. బయటకు వచ్చినా మనసును ఆహ్లాదపరిచే సన్నివేశమూ ఏమీ కనిపించే అవకాశం లేదు.

ప్రపంచం లాక్ డౌన్ అయిపొయింది. ఇంటిలోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. బయటకు వచ్చినా మనసును ఆహ్లాదపరిచే సన్నివేశమూ ఏమీ కనిపించే అవకాశం లేదు. ఇంట్లోనే కూచుని టీవీ వీక్షణంతోనే గడిపేస్తున్న ప్రజలకు భారత కాలమాన ప్రకారం రేపు (ఏప్రిల్ 8) ఉదయం 8 గంటలకు ఆకాశంలో ఓ అద్భుతం కనిపించనుంది. అందాల చందమామ మరింత సుందరంగా కనిపించనుంది. నిజానికి ఈ అద్భుతం ఈరోజు చోటు చేసుకుంటుంది. కానీ, మనకు రేపు ఉదయం కనిపిస్తుంది. అమెరికా దేశంలో మాత్రం ఈరోజు రాత్రి కనువిందు చేస్తుంది. కరోనా కల్లోలంలో కొద్దిసేపు ప్రజలను ఈ సన్నివేశం ఆహ్లాదపరుస్తుంది అనడం లో సందేహం లేదు.

వసంత ఋతువు చైత్ర మాసం చిత్తా నక్షత్రంలో వచ్చే పౌర్ణమి ఆకాశంలో అద్భుతాన్ని సృష్టించనుంది. అమెరికా కాలమానం ప్రకారం చంద్రుడు భూమి కక్ష్యలోకి మరింత దగ్గరగా ఏప్రిల్‌ 7వ తేది రాత్రి 8.30 గంటలకు వచ్చిఅతి పెద్ద పరిమాణంలో కాంతులు విరజిమ్ముతూ ప్రజలను కనువిందు చేయనున్నాడు. ఈ రోజున చంద్రునిలో వచ్చే భారీ మార్పులతో దాన్ని పింక్ , సూపర్ మూన్ అని పిలుస్తారు. ఇక భారత కాలమానం ప్రకారం ఆ చంద్రుడు బుధవారం 8వ తేదీ ఉదయం 8 గంటలకు దర్శనం ఇస్తాడని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2020 సంవత్సరంలో వెన్నెల పంచే చందమామ అతి పెద్ద పరిమాణంలో కనిపించేది ఇదే రోజు.

ఇలా కనిపించే చందమామని ఎందుకు పింక్ మూన్ గా పిలుస్తారు. ఆ ప్రత్యేకత ఏమిటి? ఇప్పుడు తెసుకుందాం. సాధారణంగా పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా కాంతుల్ని విరజిమ్ముతూ అందరినీ ఆహ్లాదపరుస్తాడు. కానీ ఈ సారి పౌర్ణమి రోజున సాధారణంగా పున్నమి రోజుల్లో కనిపించే చంద్రుడు కంటే అత్యంత ప్రకాశవంతంగా, పెద్దగా కనిపిస్తాడు ఇలా కనిపించేడాన్నే సూపర్‌ మూన్‌ అంటారు. ఈ రోజున సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే రేఖపైకి వచ్చి సూర్యుని కాంతి చంద్రునిపై పడి ఎక్కువగా ప్రకాశిస్తాడు. ఇలా భూ కక్ష్యలో చంద్రుడు దగ్గరగా ఉండే స్థానాన్ని పెరోజి అని పిలుస్తారు.

సాధారణంగా భూమికి, చంద్రుడికి మధ్య దూరం 3,84,000 కి.మీ. ఉంటుంది. కానీ చంద్రుడు పెరోజీలోకి వచ్చినపుడు ఈ దూరం దూరం 3,56,000 కి.మీ. తగ్గిపోతుందని, పౌర్ణమి నాడు కనిపించేచంద్రుడి కంటే 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడిచిన 20 సంవత్సరాలలో 79 సూపర్‌ మూన్‌లు వచ్చాయని శాస్త్ర వేత్తలు తెలిపారు. కానీ భారత్ మాత్రం ఈ మూన్ కనిపించే అవకాశాలు తక్కువ ఉన్నాయని, ఎందుకంటే భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 8 ఉదయం కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇక శాస్త్రీయ పరంగా చూసుకుంటే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే రేఖపైకి రావడం వలన చాలా ప్రజయోనాలే ఉన్నాయని కొంత మంది పండితులు చెబుతున్నారు. మంచి శుభపరిణామాలే సంభవిస్తాయని దీనిపై ప్రజలు ఎలాంటి అపోహాలు పెట్టుకొవాల్సిన అవసరం లేదంటున్నారు పండితులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories