NASA: సునీతా విలియమ్స్ జీతం ఎంతో తెలుసా?

Sunita Williams Salary Revealed
x

NASA: సునీతా విలియమ్స్ జీతం ఎంతో తెలుసా?

Highlights

Sunita Williams Salary: సునీతా విలియమ్స్ , బుచ్ విల్ మోర్‌ 2024 జూన్ 6 నుంచి అంతరిక్షంలోనే ఉన్నారు. 2025 మార్చి 12 నాటికి ఈ ఇద్దరిని భూమి మీదకు తీసుకురానున్నారు.

Sunita Williams Salary: సునీతా విలియమ్స్ , బుచ్ విల్ మోర్‌ 2024 జూన్ 6 నుంచి అంతరిక్షంలోనే ఉన్నారు. 2025 మార్చి 12 నాటికి ఈ ఇద్దరిని భూమి మీదకు తీసుకురానున్నారు. నిర్ణీత షెడ్యూల్ కంటే రెండు వారాల ముందే వీరిద్దరిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేశారు. అసలు వ్యోమగాములకు ఎంత జీతం ఇస్తారు? వ్యోమగాముల్లో ఎన్ని రకాల గ్రేడ్స్ ఉంటాయి? ఈ గ్రేడ్స్ ఆధారంగా వేతనాలు మారుతాయా? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

వ్యోమగాములకు శిక్షణ

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోగాములకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కఠినమైన పరిస్థితులను తట్టుకునేలా ఈ శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ పూర్తి చేసుకున్నవారినే అంతరిక్షంలోకి పంపుతారు. వ్యోమగాములకు ఉన్న అనుభవంతో పాటు వారు పనిచేసే మిషన్, బాధ్యతల ఆధారంగా వారి జీతాలుంటాయి. వ్యోమగాములకు గ్రేడ్లు ఇస్తారు. జీడీ-13 నుంచి జీడీ-15 వరకు వివిధ స్థాయిల్లో వ్యోమగాములను వర్గీకరిస్తారు. ఈ గ్రేడ్ల ఆధారంగా జీతాలు ఇస్తారు. అమెరికా ప్రభుత్వ జనరల్ షెడ్యూల్‌లోని ఫెడరల్ పేస్కేల్ కింద జీతాలు చెల్లిస్తారు.

జీఎస్-13: జీఎస్-13‌ గ్రేడ్ కింద ఉన్న వ్యోమగాములకు గంటకు 50.50 అమెరికన్ డాలర్లు చెల్లిస్తారు. నెలకు 8,898 డాలర్లు చెల్లిస్తారు. భారత కరెన్సీ ప్రకారం నెలకు 7లక్షల 65 వేల 228 చెల్లిస్తారు. ఇక ఏడాదికి 81,216 డాలర్ల నుంచి 105,579 డాలర్లు జీతం ఇస్తారు.

జీఎస్-14: జీఎస్-14‌ గ్రేడ్ కింద ఉన్న వ్యోమగాములకు గంటకు 59.78 డాలర్లు చెల్లిస్తారు. నెలకు 10,397 డాలర్లు అంటే రూ.8.85 లక్షల వేతనం అందిస్తారు. ఇక ఏడాదికి 95,973 డాలర్ల నుంచి 1,24,764 డాలర్లు చెల్లిస్తారు.

జీఎస్-15: జీఎస్-15 గ్రేడ్ కింద ఉన్న వ్యోమగాములకు ఏడాదికి 1,46,757 డాలర్లు చెల్లిస్తారు. భారత కరెన్సీలో రూ. 1.27 కోట్ల వేతనం చెల్లిస్తారు.

సునీతా విలియమ్స్ కు నాసా ద్వారా అదనంగా సౌకర్యాలు కల్పిస్తారు. సునీతా విలియమ్స్‌కు అవసరమైన సమగ్ర ఆరోగ్య భీమాను నాసా అందిస్తోంది. వ్యోమగాములకు అందించే అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సునీతా విలియమ్స్ కు నాసా ఏర్పాటు చేసింది. వ్యోమగాములకు నాసా అన్ని రకాల రవాణా సౌకర్యాలు కల్పిస్తోంది. వృత్తిపరంగా, మిషన్ సమయంలో అన్నిరకాల ఇన్సూరెన్స్‌ సౌకర్యాన్ని నాసా కల్పిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories