సునీతా విలియమ్స్ ఏడాది సంపాదన ఎంతో తెలుసా?

Sunita Williams salary and net worth how much nasa astronaut earn
x

సునీతా విలియమ్స్ ఏడాది సంపాదన ఎంతో తెలుసా?

Sunita Williams salary and net worth how much nasa astronaut earn

Highlights

సునీతా విలియమ్స్ ఏడాది సంపాదన రూ.1.26 కోట్లు. నాసా రికార్డుల ప్రకారంగా సునీతా విలియమ్స్ జీ-15 గ్రేడ్ వ్యోమగామి. వ్యోమగాములకు గ్రేడ్‌ల ఆధారంగా జీతాలు చెల్లిస్తారు. జీఎస్-13 నుంచి జీఎస్-15 గ్రేడ్లు విభజించారు.

Sunita Williams salary and net worth

Sunita Williams: సునీతా విలియమ్స్ ఏడాది సంపాదన రూ.1.26 కోట్లు. నాసా రికార్డుల ప్రకారంగా సునీతా విలియమ్స్ జీ-15 గ్రేడ్ వ్యోమగామి. వ్యోమగాములకు గ్రేడ్‌ల ఆధారంగా జీతాలు చెల్లిస్తారు. జీఎస్-13 నుంచి జీఎస్-15 గ్రేడ్లు విభజించారు.జీఎస్ 13 గ్రేడ్ లో వ్యోమగాములకు గంటకు 50.50 డాలర్లు చెల్లిస్తారు. ఈ లెక్కన నెలకు వారికి రూ. 7.60 లక్షలు ఇస్తారు. ఇక ఏడాదికి 81,216 డాలర్లు అందిస్తారు. అంటే ఇండియన్ కరెన్సీలో ఇది రూ.80 నుంచి 90 లక్షల వరకు ఉంటుంది.జీఎస్ 14 లో గంటకు 59.78 డాలర్లు చెల్లిస్తారు. నెలకు 10,397 డాలర్లు ఇస్తారు. ఏడాదికి 1,24,764 డాలర్లు అంటే ఒక కోటి రూపాయాల వరకు చెల్లిస్తారు.

జీఎస్ 15 గ్రేడ్ లో ప్రతి ఏటా 1,46,757 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1 కోటి 25 లక్షలు అందిస్తారు.అమెరికా మిలటరీలో పనిచేసేవారికి ఇచ్చే జీతాలకు సరిసమానంగా వ్యోమగాములకు జీతాలుంటాయి. 1988లో సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లేందుకు శిక్షణ పొందారు.

సునీతా విలియమ్స్ గతంలో నేవీలో పని చేశారు. ఆమె నికర సంపద విలువ 5 మిలియన్ డాలర్లుగా ఉంటుందని రిపోర్టులు చెబుతున్నాయి. సునీతా విలియమ్స్ కు హైల్త్ ఇన్సూరెన్స్ నాసా అందిస్తోంది. వ్యోమగాములకు అన్ని రకాల రవాణ సౌకర్యాలు నాసా అందిస్తోంది.

స్టార్ లైనర్ లో 2024 జూన్ 6న సునీతా విలియమ్స్ , విల్ బుచ్ మోర్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఎనిమిది రోజులు మాత్రమే వీరిద్దరూ అంతరిక్షంలో ఉండాలి. కానీ, స్టార్ లైనర్ లో టెక్నికల్ సమస్యలు ఏర్పడడంతో అంతరిక్షంలోనే చిక్కుకున్నారు. వీరిని భూమి మీదకు ఈ మార్చిలో తీసుకురానున్నారు. ఈ విషయాన్ని నాసా ప్రకటించింది.సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న స్టార్ లైనర్ వ్యోమనౌక సురక్షితంగానే 2024 సెప్టెంబర్ లో దిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories