Ninja technique: పరీక్ష రాసి ఖాళీ పేపర్‌ ఇస్తే... ప్రొఫెసర్ అత్యధిక మార్కులు వేశారు

Ninja technique: పరీక్ష రాసి ఖాళీ  పేపర్‌ ఇస్తే... ప్రొఫెసర్ అత్యధిక మార్కులు వేశారు
x
Highlights

ఓ ప్రొఫెసర్ పరీక్ష పేడితే ఆ విద్యార్ధిని రాసి ఖాళీ పేపర్ ఇచ్చింది. దానిని చూసిన ప్రొఫెసర్ ఆ విద్దార్థికి ఎక్కువ మార్కులు వేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన జపాన్ లో జరిగింది.

ఓ ప్రొఫెసర్ పరీక్ష పేడితే ఆ విద్యార్ధిని రాసి ఖాళీ పేపర్ ఇచ్చింది. దానిని చూసిన ప్రొఫెసర్ ఆ విద్దార్థికి ఎక్కువ మార్కులు వేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన జపాన్ లో జరిగింది. జపాన్‌లోని మియీ విశ్వవిద్యాలయంలోని విద్యార్థిని ఈమీ హాగా నింజా చరిత్ర చదువుతున్నారు. దానిపై నిర్వహించిన పరీక్షల్లో నింజా చరిత్రపై వ్యాసం రాశారు.

విద్యార్థి ఈమీ హాగా నింజా మ్యూజియంను సందర్శించిన అనంతరం తెలుసుకున్న విషయాలు గురించి వ్యాసం రాయాలని ప్రోఫెసర్ యూజీ యమడ చెప్పాడు. అయితే తాను రాసిన పేపర్‎పై చిన్న అక్షరాలతో వేడి చేసి చూస్తే అక్షరాలు కనిపిస్తాయని విద్యార్ధి రాశారు. అయితే ప్రొఫెసర్ ఇంటికి తీసుకెళ్లి వేడి చేసి చూశాడు. ఆమె రాసిన పదాలు కనిపించాయి.

విద్యార్ధులకు ముందుగానే విభిన్నంగా, సృజనాత్మకంగా రాసిన వారికి మార్కులు వేస్తానని ప్రొఫెసర్ చెప్పాడు. దీంతో ఈమీ హాగా భిన్నంగా వ్యాసం రాసింది. అబురిదాషి టెక్నిక్‌ సంబంధించిన ఇంకును సోయాబిన్స్ నానబెట్టి తయారు చేస్తారు. వాస్తవానికి నింజాను నింజుత్సు అంటారు అంటే వీరవిద్య అని అర్ధం. ఈ టెక్నిక్ జపాన్‌లో వేల ఏళ్ల నాటిది. అయితే ఈ విద్యలో పూర్వీకులు ఎక్కువగా ఉపయోగించేవారు. నింజా పై అనేక సినిమాలు కూడా వచ్చాయి. ఎప్పటి నుంచో ఉన్న అబురిదాషి టెక్కిక్‌ను మళ్లీ ఇప్పుడు గుర్తుతెస్తూ.. ఈమీహాగా తన సృజనాత్మకంగా రాసిన విధానాన్ని అందరూ ప్రసంశిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories