Russia: రష్యాలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి

* పెర్మ్ స్టేట్ యూనివర్శిటీలో విద్యార్థి కాల్పులు * తుపాకీ శబ్దాలతో ఉలిక్కిపడ్డ ఉపాధ్యాయులు, విద్యార్థులు

Sandeep Reddy
Updated on: 20 Sept 2021 6:15 PM IST
Student Gun Fire in Perm State University in Russia Today 20 09 2021
X

భయంతో పరుగులు తీసిన వైనం (ట్విట్టర్ ఫోటో)

Russia: రష్యాలో కాల్పుల కలకలం రేగింది. పెర్మ్ క్రెయ్ ప్రాంతంలోని పెర్మ్ స్టేట్ యూనివర్శిటీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. అదే విశ్వవిద్యాలయంలో చదువుతున్న 18ఏళ్ల విద్యార్ధి తోటి విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. యూనివర్శిటీలోకి తుపాకీతో వచ్చిన నిందితుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.

తుపాకీ శబ్దాలతో ఉలిక్కిపడ్డ ఉపాధ్యాయులు, విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. కొంతమంది ఆడిటోరియంలోకి వెళ్లి దాక్కోగా మరికొందరు కిటికీల నుంచి దూకి బయటకు పరిగెత్తారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story