Donald Trump: మ్యాథ్స్‌ కోర్సులో జాయిన అయిన విద్యార్థులను ట్రంప్‌ టార్గెట్‌ చేశారా? వారందరిని ఇంటికి పంపించేస్తారా?

Donald Trump
x

Donald Trump: మ్యాథ్స్‌ కోర్సులో జాయిన అయిన విద్యార్థులను ట్రంప్‌ టార్గెట్‌ చేశారా? వారందరిని ఇంటికి పంపించేస్తారా?

Highlights

Donald Trump: అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు OPT ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయాలన్న లక్ష్యంతో రూపొందించారు.

Donald Trump: ట్రంప్ అధ్యక్ష పీఠం అధిరోహించినప్పుడు అమెరికాలోని చాలా మంది ఇండో-అమెరికన్లు దీన్ని పెద్ద విజయంగా చూసారు. కానీ పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ట్రంప్ పాలనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన తీసుకుంటున్న వీసా సంబంధిత నిర్ణయాలు, ఉన్న అవకాశాలను కోల్పోయేలా చేస్తూ భవిష్యత్తుపై అనేక అనిశ్చితులను తెచ్చిపెడుతున్నాయి.

ప్రస్తుతం STEM కోర్సులు చదువుతున్న వారు ఎక్కువగా తమ చదువు పూర్తయిన తర్వాత OPT అనే ప్రోగ్రామ్ ద్వారా అక్కడే ఉద్యోగ అనుభవం పొందుతున్నారు. ఈ ప్రోగ్రామ్ విద్యార్థులకు చదివిన రంగంలో తాత్కాలికంగా పని చేసే అవకాశం కల్పిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్ లాంటి విభాగాల్లో స్పెషలైజ్ అయిన విద్యార్థులకు మూడు సంవత్సరాల వరకు ఈ అవకాశాలు లభిస్తున్నాయి. ఇది వారిని తర్వాత H-1B వీసాకు అప్లై చేయడానికి ఉపయోగపడుతుంది.

కానీ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త బిల్లుతో ఈ అవకాశం పూర్తిగా లేకుండా పోవచ్చనే భయాలు మొదలయ్యాయి. 'ఫెయిర్‌నెస్ ఫర్ హై-స్కిల్డ్ అమెరికన్స్ ఆక్ట్' అనే పేరుతో అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు OPT ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయాలన్న లక్ష్యంతో రూపొందించారు. దీన్ని నెపంగా చేసుకొని విదేశీ విద్యార్థులపై నిఘా పెంచడం, వీసా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఆ ప్రొగ్రామ్‌ రద్దయితే ఇండియన్స్ పరిస్థితి దారుణంగా తయారువుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories