శ్రీలంకలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం

Sri Lankan People Queuing Up to Go Abroad
x

శ్రీలంకలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం

Highlights

*కొలంబోలోని ఇమిగ్రేషన్ ఆఫీస్ ఎదుట ప్రజల బారులు

Sri Lanka: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. తీవ్రమైన విదేశీ మారక ద్రవ్య సంక్షోభంతో పాటు ఈ ఏడాది రుణ చెల్లింపుల్లో బిలియన్ల డిఫాల్ట్‌కు దారితీసింది. ఈ క్రమంలోనే నిత్యావసరాలైన ఆహారం, మందులు వంటి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి ప్రజలు విదేశాలకు వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. వేలాది మంది ప్రజలు పాస్‌పోర్ట్ కోసం ఇమిగ్రేషన్ కార్యాలయం ముందు బారులు తీరారు.

శ్రీలంక రాజధాని కొలంబోలో వేలాది మంది ఇమిగ్రేషన్ కార్యాలయం ఎదుట క్యూలో వేచి ఉన్నారు. ప్రతిరోజు సుమారు 3వేల మంది ప్రజలు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందు కోసం 15వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు శ్రీలంక ప్రజలు చెప్తున్నారు. మరోవైపు వారంలో ఆరు రోజులు కార్యాలయం తెరిచే ఉంటుంది. దీంతో పాటు 24గంటల పాస్‌పోర్ట్ ఆఫీస్ నడుస్తుంది. ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఉద్యోగవకాశాలు ఉండటంతో, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పని కోసం సౌదీ అరేబియాకు వెళ్లడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories