కొబ్బరి చెట్టెక్కి మరీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మంత్రి

కొబ్బరి చెట్టెక్కి మరీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మంత్రి
x
Highlights

దేశంలో కొబ్బరికాయల కొరత ఉందని.. ఈ సమస్య ప్రభుత్వానికి వినిపించాలని ఓ మంత్రి వినూత్నంగా కొబ్బరిచెట్టు ఎక్కిమరీ చెప్పారు. ఈ ఘటన శ్రీలంకలో..

దేశంలో కొబ్బరికాయల కొరత ఉందని.. ఈ సమస్య ప్రభుత్వానికి వినిపించాలని ఓ మంత్రి వినూత్నంగా కొబ్బరిచెట్టు ఎక్కిమరీ చెప్పారు. ఈ ఘటన శ్రీలంకలో చోటుచేసుకుంది. శ్రీలంకలో కొబ్బరికాయల వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంది. పల్లెల్లో మెజారిటీ రైతులు కొబ్బరికాయల మీదే తమ జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా దేశంలో విపరీతంగా కొబ్బరి కొరత ఏర్పడింది. దేశవ్యాప్తంగా 70 కోట్ల కొబ్బరి చెట్ల కొరత ఉందని, ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వానికి వినిపించేందుకు తాను కొబ్బరి చెట్టు ఎక్కి చెప్పినట్టు మంత్రి అరుందికా ఫెర్నాండో తెలిపారు.

అందుబాటులో ఉన్న ప్రతి భూమిని కొబ్బరికాయల సాగు కోసం ఉపయోగించాలని ఆయన సూచన చేశారు. దేశానికి విదేశీ మారకద్రవ్యం కలిగించే విధంగా పరిశ్రమలకు ఊతమివ్వాలని చెప్పారు. కొబ్బరికాయల ధరల సమస్యకు పరిష్కారం చూపుతూ, దేశంలో కొబ్బరికాయల కొరత నేపథ్యంలో ధరలు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. కాగా కొబ్బరి కాయల కొరతను అధిగమించేందుకు మంత్రి ఫెర్నాండో తీసుకుంటున్న చర్యలను పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories