ప్రపంచాన్ని వణికిస్తోన్న క్యాన్సర్

ప్రపంచాన్ని వణికిస్తోన్న క్యాన్సర్
x
Highlights

క్యాన్సర్ మహామ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందర్నీ కాటేస్తోంది. ముఖ‌్యంగా 15 ఏళ్ల లోపు పిల్లలు బ్లడ్ క్యాన్సర్...

క్యాన్సర్ మహామ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందర్నీ కాటేస్తోంది. ముఖ‌్యంగా 15 ఏళ్ల లోపు పిల్లలు బ్లడ్ క్యాన్సర్ బారినపడుతున్నారు. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. చిన్నారులను బలి తీసుకుంటున్న క్యాన్సర్ పై స్పెషల్ స్టోరీ. క్యాన్సర్ వ్యాధి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. పెద్దవారికి అధికంగా లంగ్, బ్రెస్ట్, మౌత్ క్యాన్సర్ వస్తుంటే, చిన్న పిల్లలకు బ్లడ్ క్యాన్సర్ కాటేస్తోంది.

ప్రపంచంలో మూడో వంతు ఇండియాలో ఉండే పిల్లలు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. వీరిలో అధికులు బ్లడ్ క్యాన్సర్ బాధితులే. క్యాన్సర్ చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావడంతో పేద రోగులు మధ్యలోనే మృతి చెందుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో క్యాన్సర్ వ్యాధి చికిత్సకు లక్షలాది రూపాయల ఖర్చు అవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా ట్రీట్ మెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని MNJ క్యాన్సర్ హాస్పిటల్ కు ప్రతి రోజు 30 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారు. కొందరు రోగులకు ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని మూడు నుంచి నాలుగు నెలల పాటు చికిత్స అందజేస్తారు.

ఈ మధ్యకాలంలో ఆసుపత్రులకు పిల్లలు ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్ తో వస్తున్నారు. ఈ మహామ్మరి బారినపడిన చిన్నారుల ముక్కు నుంచి రక్తం కారుతోంది అని డాక్టర్లు చెబుతున్నారు. కొందరు క్యాన్సర్ రోగులు మొదట ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుని తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తారు. రోగం ముదిరినప్పుడు తిరిగి సర్కార్ ఆసుపత్రికి వస్తారు. దీంతో చికిత్స కష్టతరం అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆరోగ్య శ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ కింద చేయించే చికిత్సలకు సకాలంలో నిధులు విడుదలకాకపోవడంపై రోగుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులు సకాలంలో రిలీజ్ అయితే ఎంతో మంది పేద పిల్లలు క్యానర్స్ బారి నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories