స్పెయిన్లో కరోనా విజృంభణ.. లక్షలాది ఉద్యోగుల తీసివేత..!

స్పెయిన్లో కరోనా విజృంభణ.. లక్షలాది ఉద్యోగుల తీసివేత..!
x
Highlights

స్పెయిన్ లో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే వైరస్ భారిన పడి 950 మంది మృతి చెందారు.

స్పెయిన్ లో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే వైరస్ భారిన పడి 950 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,053 నుండి దేశ మరణాల సంఖ్య 10,003 కు పెరిగింది. అంతేకాదు గురువారం అంటువ్యాధుల సంఖ్య సైతం 110,238 కు పెరిగింది, ఇది ముందు రోజు వరకూ 102,136 గా ఉంది.మూడు రోజుల కిందటి వరకూ కేసుల సంఖ్య కాస్త మందగించినా గురువారం ఒక్కసారిగా పెరిగింది. గురువారం ఒక్కరోజే అంటువ్యాధుల పెరుగుదల శాతం 7.9 నమోదయింది. పెరుగుతున్న మరణాల సంఖ్య స్పానిష్ ప్రజలకు మరింత దుక్కాన్ని కలిగించినప్పటికీ, ఆరోగ్య మంత్రి సాల్వడార్ ఇల్లా మాత్రం వైరస్ క్రమంగా బలహీనపడుతోందని.. రోగులు కోలుకుంటున్నారని పార్లమెంటు వేదికగా భరోసా ఇస్తున్నారు.

ఇదిలావుంటే సుమారు 47 మిలియన్ల జనాభా కలిగిన దేశం స్పెయిన్. మార్చి మధ్యలో లాక్డౌన్లోకి వెళ్ళినప్పటి నుండి తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లిపోయింది. దానికి తోడు ఉద్యోగాల తొలగింపు పెద్ద తలనొప్పిగా మారింది. వివిధ కంపీనీలు 900,000 ఉద్యోగాలను తొలగించింది, వీటికి తోడు తాత్కాలిక తొలగింపులు 620,000 ఉన్నాయి. అలాగే సామాజిక భద్రతకు సంబంధించిన సుమారు 80,000 మంది కార్మికులు కరోనావైరస్ తో ఉన్నారని, మరో 170,000 మంది అనారోగ్య సెలవులో ఉన్నారని కార్మిక మంత్రి యోలాండా డియాజ్ స్పష్టం చేశారు.

స్పెయిన్ దేశం కొంతకాలంగా తీవ్రమైన నిరుద్యోగ సమస్యతో బాధపడుతోంది, 2008-09 ఆర్థిక సంక్షోభం తరువాత, నిరుద్యోగిత రేటు 27 శాతానికి తగ్గింది. ప్రస్తుతం "ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కారణంగా దేశం స్తంభించిపోయింది.. అందువల్ల ఆర్ధిక వ్యవస్థ చితికిపోయింది" అని స్పెయిన్ యొక్క అతిపెద్ద కార్మిక సంఘం CCOO నాయకుడు ఉనాయ్ సోర్డో బ్రాడ్కాస్టర్ చెప్పారు.

సాధారణంగా స్పెయిన్లో మార్చి నెలకు ప్రాముఖ్యత ఉంది.. ఈ నెలలో ఉపాధికి మంచి నెల, ఎందుకంటే తాత్కాలిక కార్మికులు అధిక సంఖ్యలో ఉద్యోగాలు పొందుతారు, ముఖ్యంగా ఆతిథ్య రంగంలో. అయితే ప్రస్తుతం కరోనా రాక తో ఆర్ధిక రంగం విలవిలాడుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories