అంతరిక్షయానంలో చారిత్రక ఘట్టం.. ఓ ప్రైవేటు వ్యోమనౌకలో నింగిలోకి వ్యోమగాములు

అంతరిక్షయానంలో చారిత్రక ఘట్టం.. ఓ ప్రైవేటు వ్యోమనౌకలో నింగిలోకి వ్యోమగాములు
x
Highlights

అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఓ ప్రైవేటు సంస్థకు చెందిన అంతరిక్షనౌకలో వ్యోమగాములు రోదసీలోకి వెళ్లారు.

అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఓ ప్రైవేటు సంస్థకు చెందిన అంతరిక్షనౌకలో వ్యోమగాములు రోదసీలోకి వెళ్లారు. వ్యోమగాములు అమెరికా గడ్డపై తొమ్మిదేళ్ల తర్వాత నుంచి ఐఎస్‌ఎస్‌కు వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ ప్రయోగంపై అందరిలోను ఆసక్తి నెలకొంది. నాసా ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో కెన్నడీ స్పేస్‌ స్టేషన్‌ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 3:22 గంటలకు మానవ సహిత 'క్రూ డ్రాగన్‌' క్యాప్సూల్‌ను మోసుకెళ్లిన ఫాల్కన్‌-9 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ వెళ్ళింది.

రాకెట్‌ ద్వారా డగ్లస్ హర్లీ , రాబర్ట్ బెంకెన్‌ అంతరిక్షంలోకి ప్రయాణమయ్యారు. దాదాపు 19 గంటల ప్రయాణం తర్వాత వీరు ఐఎస్‌ఎస్‌కు చేరుకోనున్నారు. రష్యా వ్యోమగాములు అనాటోలీ ఇవానిషిన్‌, ఇవాన్‌ వాగ్నెర్‌, అమెరికా వ్యోమగామి క్రిస్‌ కాసిడీలను కలుసుకోనున్నారు. వాస్తవానికి బుధవారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో చివరి నిమిషాల్లో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఈ ప్రయోగాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పలువురు అధికారులతో కలిసి వీక్షించారు. ఈ సంధర్భంగా 'ఇది చాలా ప్రత్యేకమైనది. ఇవాళ అమెరికా గడ్డపై నుంచి, అమెరికన్‌ రాకెట్లలో, అమెరికా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాం' అని ట్రంప్‌ పేర్కొన్నారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories