దక్షిణ కొరియా కృత్రిమ సూర్యుడు.. ప్రపంచ రికార్డు

దక్షిణ కొరియా కృత్రిమ సూర్యుడు..  ప్రపంచ రికార్డు
x
Highlights

మనవుడి మేధస్సు కొత్తపుంతలు తొక్కుతోంది. కళ్ల ముందో మరో ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. దేశాలన్ని కృత్రిమ సూర్యుడిని సృష్టించే పనిలో పడ్డాయి. దీనికోసం...

మనవుడి మేధస్సు కొత్తపుంతలు తొక్కుతోంది. కళ్ల ముందో మరో ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. దేశాలన్ని కృత్రిమ సూర్యుడిని సృష్టించే పనిలో పడ్డాయి. దీనికోసం విపరీతంగా ప్రయోగాలు చేస్తున్నారు.ఇటీవలే చైనా న్యూక్లియర్ ల్యాబ్‌లో ఓ కృత్రిమ సూర్యుడిని సృష్టించిన విషయం తెలిసిందే. దీనిని 'హెచ్ఎం2 టోకామర్ రియాక్టర్' అని పిలుస్తుండగా.. ఇది సూర్యుడి కంటే అధిక శక్తిని, వేడిని విడుదల చేస్తుందని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అయితే ఇప్పుడు దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు కూడా కె-స్టార్‌ (ది కొరియా సూపర్‌ కండక్టింగ్‌ టొకమాక్‌ అడ్వాన్సుడ్‌ రీసెర్జ్‌) సూర్యుడిని సృష్టించారు. అందులో న్యూక్లియర్ ఫ్యూజన్ జరిపి ఏకంగా 10 కోట్ల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పుట్టించారు. 20 సెకండ్ల పాటు ఏకంగా స్టార్‌లో మాత్రం 10 కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రతలను సృష్టించి చరిత్ర లిఖించారు. నిజానికి సూర్యుడిలోని ఉష్ణోగ్రతలు 1.5 కోట్ల డిగ్రీలకు పరిమితం. ఫ్యుజన్‌ రియాక్టర్‌ సాయంతో ఆయాన్లను అధిక వేడిలో ఉంచడం ద్వారా... ప్లాస్మా 100 మిలియన్‌ డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో 20 సెకండ్ల పాటు కొనసాగేలా పరిశోధకులు విజయం సాధించారు. దక్షిణ కొరియాలోని 'కొరియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీ'లో ఈ ప్రయోగం నిర్వహించారు. దక్షిణ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్శిటీ, అమెరికాకు చెందిన కొలంబియా యూనివర్శిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ ప్రయోగం చేపట్టయి. ఇంతకంటే ముందు 100 మిలియన్ డిగ్రీల వేడిని పుట్టించినా, 10 సెకన్ల కన్నా ఎక్కువ సమయం కొనసాగలేదు. దాంతో గత ప్రయత్నాలతో పోలిస్తే, ఇది గణనీయమైన మెరుగుదలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories