coronavirus : ఉత్తరకొరియాలో 700 మంది ఒకేచోట..

coronavirus : ఉత్తరకొరియాలో 700 మంది ఒకేచోట..
x
Highlights

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించిన చందంగా.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జుంగ్ ఉన్ ప్రవర్తన ఉంది.. ప్రపంచం మొత్తం కరోనా వైరస్...

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించిన చందంగా.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జుంగ్ ఉన్ ప్రవర్తన ఉంది.. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే.. ఆయన మాత్రం తాపీగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. దీంతో దాయాది దేశం దక్షిణ కొరియాకు ఒళ్ళు మండి ఒక్కటిచ్చింది. ఇటీవల ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జుంగ్ ఉన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగాలు చేశారు.. అంతేకాదు వాటిని దగ్గరుండి మరి పర్యవేక్షించారు. అంతటితో ఆగకుండా కరోనా వైరస్ కు అన్ని దేశాలు భయపడుతున్నాయని ఎద్దేవా చేస్తూ.. కరోనాను ఉత్తర కొరియా సమర్థవంతంగా ఎదుర్కొందని తెలియజేసేందుకు ఏకంగా 700 మంది అధికారులు ఒక్కచోట చేరాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్‌ అసెంబ్లీ శనివారం సమావేశం కానుందని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే ఈ పరిణామాలను దక్షిణ కొరియా తీవ్రంగా తప్పుబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఇలా క్షిపణులు పరీక్షించడం ఏంటని మండిపడింది. ఈ మేరకు శనివారం ఉదయం 6.45- 50 నిమిషాల సమయంలో కొరియా ద్వీపంలోని సోన్‌చోన్‌ సమీపంలో ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వెల్లడించింది.. ఉత్తర కొరియా సైనిక చర్య అభ్యంతరకరంగా ఉందని ఆ దేశం వ్యాఖ్యానించింది. అయినా కిమ్ ఈ ఆక్షేపణలు లెక్కచేయకుండా క్షిపణి ప్రయోగాలపై సమీక్ష నిర్వహించారని కొందరు జర్నలిస్టులు పేర్కొన్నారు.

కాగా గత ఏడాది చివర్లో చైనాలో మొట్టమొదటిసారిగా కనుగొనబడిన కొత్త కరోనావైరస్ కేసులను ఉత్తర కొరియా నివేదించలేదు, అయితే ఉత్తర కొరియాలో అంటువ్యాధులు ఉన్నాయని "చాలా ఖచ్చితంగా" అక్కడ వైరస్ ఉందని యునైటెడ్ స్టేట్స్ సైనిక అధికారి ఒకరు గత వారం చెప్పారు. మరోవైపు అక్కడ వైరస్ ఉద్భవించినా బయటి ప్రపంచానికి తెలియనీయకుండా సమాధి చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇదంతా ప్రపంచం దృష్టిలో పడటానికే.. అలా చేసి తనను తాను మోసం చేసుకోవడమే తప్ప సాధించేది లేదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories