దేశంలోకి కరోనా నా వల్లే వచ్చింది.. క్షమించండి

దేశంలోకి కరోనా నా వల్లే  వచ్చింది.. క్షమించండి
x
Lee Man-hee is the founder of the Shincheonji Church
Highlights

కరోనావైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న అతి భయంకరమైన వ్యాధి.

కరోనావైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న అతి భయంకరమైన వ్యాధి. ఇప్పటికీ ఈ కరోనా బారినా పడి వేలాది మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ వైరస్ కారణంగా చైనా ఇప్పటివరకు 2,912 మరణాలను చవిచూసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మూడువేల మందికిపైగా మరణించారు. అయితే COVID19 లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్న 37 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. ఈ భయంకరమైన వ్యాధికి మెడిసిన్ కనిపెట్టేందుకు ప్రపంచ శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే దేశంలోకి కరోనా తన వల్లే వచ్చిందంటూ ఓ మతపెద్ద క్షమాపణ కోరాడు. ఈ ఘటన దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది. దక్షిణ కొరియాకు ఓ మతపెద్ద చర్చి తరపున ఓ నిర్వహించిన కార్యక్రమంలో 61ఏళ్ల మహిళ పాల్గొంది. అయితే , అప్పటికే ఆమెకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయం చర్చి నిర్వాహకులు తెలియక పోవడంతో ఆ మహిళను కార్యక్రమంలో పాల్గొననిచ్చారు. దక్షిణ కొరియాలో కరోనా వ్యాప్తి చెందింది.

అయితే ఈ చర్చి లీ మాన్ హీ మాత్రం కరోనా పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించారు. ఈ పరీక్షలకు అంగీకరించకపోతే అరెస్టు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో కరోనా పరీక్షలు చేయించుకున్న లీ మాన్ హీకి వైరస్ సోకలేదని తేలింది. ఈ నేపథ్యంలో దేశంలోకి తన వల్లే కరోనా వచ్చిందని లీ మాన్ హీ బాధపడ్డారు. కరోనా వ్యాప్తిని కారణమైన తనను క్షమించాలంటూ తల నేలకానించి కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories