ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దక్షిణాఫ్రికా

South Africa Suffers with Omicron Variant and World Health Organization Visited South Africa
x

ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దక్షిణాఫ్రికా

Highlights

దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్‌వో గౌంటెంగ్ ప్రావిన్స్‌లో 80 శాతం కేసులు నవంబర్‌ మొదట్లో 200 నుంచి 300 కేసులు

Omicron Variant: కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్‌ వేరియెంట్‌తో దక్షిణాఫ్రికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో డబ్ల్యూహెచ్‌వో బృందం ఆ దేశానికి వెళ్లింది. ఒమిక్రాన్‌ వేరియెంట్‌కి కేంద్రమైన గౌటాంగ్‌ ప్రావిన్స్‌లో కేసుల్ని పర్యవేక్షించడానికి డబ్ల్యూహెచ్‌ఒ తన బృందాన్ని పంపించింది. కరోనా బాధితులతో కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించి పరీక్షలను అత్యధికంగా నిర్వహించడానికి ఈ బృందం దక్షిణాఫ్రికాకు వెళ్లినట్టుగా డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. దేశంలోని కేసుల్లో 80 శాతం దక్షిణాఫ్రికా ఎకనామిక్‌ హబ్‌ అయిన గౌంటెంగ్‌ ప్రావిన్స్‌లో వెలుగు చూశాయి.

దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ విశ్వరూపం చూపిస్తోంది. నవంబర్‌ మొదట్లో రోజుకి 200 నుంచి 300 కేసులు నమోదైతే గురువారం ఒక్క రోజే దక్షిణాఫ్రికాలో 11వేల, 500 కొత్త కేసులు వెలుగులోకి రావడం ఆందోళన పుట్టిస్తోంది. ఎక్కువగా 10–14 ఏళ్ల వారికి సోకుతున్నాయి. 5 ఏళ్లలోపు పిల్లలు ఆస్పత్రి పాలవుతున్నారని దక్షిణాఫ్రికా అధికారులు చెప్పారు. కొత్త వేరియెంట్‌ గురించి దక్షిణాఫ్రికా హెచ్చరించిన వారం రోజుల్లోనే 5రెట్లు ఎక్కువ కేసులు నమోదవడం దడ పుట్టిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories