Snowfall: వాన చినుకులు మరిపించే విధంగా మంచు జల్లులు

Snowfall In North India
x

Snowfall: వాన చినుకులు మరిపించే విధంగా మంచు జల్లులు

Highlights

Snowfall: మంచు దుప్పట్లో ఉత్తర భారతం

Snowfall: చలికాలంలో మంచు కురవడం సర్వసాధారణమైన విషయమే. అయితే వాన చినుకులను మరిపించే వింధంగా నింగి నుంచి జాలువారుతున్న హిమపాతం చూపరులను ఆకట్టుకుంటోంది. స్వాతి చినుకులను తలపించే విధంగా కురుస్తున్న తెల్లని ముత్యపు మంచు జల్లుల్లో తడుస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఎటు చూసినా మంచు కమ్మేయడంతో స్విట్జర్లాండ్‌లో ఉన్న అనుభూతి కలుగుతోంది. హిమపాతంతో నిండిన కాశ్మీర్ లోయ... మంచుకురిసే వేళలలో అలరిస్తున్న సిమ్లా అందాలు... స్నో వారల్డ్‌గా మారిన శ్రీనగర్‌ని చూస్తుంటే స్వర్గం భూమి మీదే ఉన్నట్లుగా అనిపిస్తోంది.

కులు, మనాలి ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది చల్లని మంచు కొండలు. ఇంత అందమైన స్నో ఏరియా మరింత సోయగంతో సుందర సుమనోహరంగా మరాంది. మేఘాల నుంచి మంచు పల్లకి మోసుకొస్తున్న ప్రకృతి... తన హొయలొలికే అందాలతో ఊరిస్తూ, కవ్విస్తూ మైమరపిస్తుంది. కులు, మనాలి, దోడా ప్రాంతాలు పొగ మంచుతో నిండిపోయిన ఆకట్టుకుంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories