అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలను వణికిస్తున్న మంచు తుపాన్‌

Snow cyclone in American south states
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

* ఎడతెరపి లేని హిమపాతానికి స్తంభించిన జనజీవనం * భారీగా కురుస్తున్న మంచుతో జనజీవనం అస్తవ్యస్తం

కాన్సాస్‌లో కరెంటు కష్టాలు కూడా మొదలయ్యాయి. దీంతో విద్యుత్‌ను పరిమితంగా వాడాలని అక్కడి గవర్నర్ నగరవాసులను కోరారు. ఇక కెంటకీలో మరింత బలంగా చలి గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలన్నీ పాటించాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. ఇప్పటికీ 27 లక్షల మందికిపైగా ప్రజలు చీకట్లోనే మగ్గిపోతున్నారు.

లూసియానా, డల్లాస్‌ రాష్ట్రాల్లోనూ మంచు బీభత్సం నెలకొంది. ఆర్కిటిక్‌ నుంచి వీస్తున్న బలమైన చలిగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధ్యక్షుడు జో బైడెన్​ ఇప్పటికే హోం శాఖకు ఆదేశాలు జారీ చేశారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు.

అయితే విద్యుత్​ పునరుద్ధరణపై ఇంకా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. శీతల వాతావరణం కారణంగా సంస్థలు ఏ రకంగానూ విద్యుత్​ను ఉత్పత్తి చేయలేకపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. తుపాను ప్రభావం కొవిడ్​ టీకా పంపిణీపైనా పడింది. హారిస్​ కౌంటీ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరా నిలిచిపోవడం వల్ల కొవిడ్​ టీకాలు పాడయ్యే ప్రమాదం ఉంది. నష్టనివారణపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories