Plane Crash: ఘోరప్రమాదం..హెలికాప్టర్ ను ఢీకొట్టి..నదిలో కుప్పకూలిన విమానం

Plane Crash: ఘోరప్రమాదం..హెలికాప్టర్ ను ఢీకొట్టి..నదిలో కుప్పకూలిన విమానం
x
Highlights

Washington Plane Crash: అమెరికాలో ఘోరప్రమాదం జరిగింది. వాషింగ్టన్ లో ఓ చిన్న విమానం కూలిపోయింది. రొనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టు సమీపంలోని పోటోమాక్ నదిలో...

Washington Plane Crash: అమెరికాలో ఘోరప్రమాదం జరిగింది. వాషింగ్టన్ లో ఓ చిన్న విమానం కూలిపోయింది. రొనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టు సమీపంలోని పోటోమాక్ నదిలో దాదాపు 60మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది.

పీఎస్ఏ ఎయిర్ లైన్స్ కు చెందిన చిన్న విమానం గాలిలోనే ఉండగానే మిలటరీ హెలికాఫ్టర్ ఢీకొట్టింది. ఎయిర్ పోర్టు పక్కనే ఉన్న నదిలో విమానం కూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎయిర్ పోర్టులో ఈ ప్రమాదం జరగడంతో ఇతర విమానాలు ల్యాండింగ్ టేకాఫ్ లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గురైన విమానం కాన్సస్ నుంచి వాషింగ్టన్ వెళ్తున్నట్లు రిపబ్లికన్ పార్టీకి చెందిన కాన్సాస్ సెనెటర్ జెర్రీ మోరన్ వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories