ప్రపంచం అంతం కోసం .. ఆరుగురు పిల్లలతో 10 ఏళ్లుగా చీకటి గదిలో

ప్రపంచం అంతం కోసం .. ఆరుగురు పిల్లలతో 10 ఏళ్లుగా చీకటి గదిలో
x
Highlights

ఒకరోజు చీకట్లో ఉండాలంటేనే భయపడతాం. అలాంటికి ఓ వ్యక్తి తన ఆరగురు పిల్లలతో ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా 10ఏళ్ల పాటు జీవనం సాగిస్తున్నారు. పైగా వారు ఆ గదిలో ఉంది ప్రపంచం అంతమయ్యే సమయంకోసం ఎదురు చూస్తున్నారు

ఒకరోజు చీకట్లో ఉండాలంటేనే భయపడతాం. అలాంటిది ఓ వ్యక్తి తన ఆరగురు పిల్లలతో ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా 10ఏళ్ల పాటు జీవనం సాగిస్తున్నారు. కాగా వారు ఆ గదిలో ప్రపంచం అంతమయ్యే సమయంకోసం ఎదురు చూస్తున్నారు. అవును నమ్మలేం కానీ, వాస్తవంగా జరిగిన కొన్ని యదార్ధ ఘటనలు నమ్మితిరాలి. విస్తుగొలిపే ఈ ఘటన నెదర్లాండ్స్‌లోని జరిగింది.

నెదర్లాండ్స్‌లోని రూయినర్‌వోల్డ్‌లో ఓ మారుమూల ప్రాంతంలోని ఫామ్ హౌస్‌లో ఆరుగురు పిల్లలతో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పైగా ఆ ఇంట్లో ఎంత మంది ఉన్నారనే విషయం పక్కింటి వారికి కూడా తెలిసేది కాదు. కేవలం ఆ ఇంటి యాజమాని మాత్రమే బయటకు వచ్చి పొలంలో పండిన కూరగాయలు, పాల ఉత్పత్తులతో వారు ఇన్నేళ్లూ జీవనం గడిపారు. ఆరుగురు పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. పిల్లల్లోకి పెద్దవాడైన 25 ఏళ్ల కుర్రాడు ఒకడు ఆ ఇంటి నుంచి తప్పించుకుని వెళ్లీ కేఫ్ సిబ్బందికి చెప్పాడు. మొదట వారు నమ్మలేదు కానీ అతను తనకు ఐదుగురు తమ్ముళ్లు, చెల్లెలు ఉన్నారని 10 ఏళ్లుగా బయటకు రాలేదని వివరించాడు. తనకు సాయం కావాలని కేఫ్ సిబ్బందిని కోరాడు. కేఫ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడ్ని వివరాలు అడిగారు.ఆ యువకుడు చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు విచారణ చేపట్టారు. వారు నివాసం ఉంటున్న చోటుకు వెళ్లగా, సిట్టింగ్ రూమ్‌లో నుంచి కప్బోర్డ్ వెనుక గదిలోకి వెళ్లడానికి రహస్య మెట్ల మార్గం ఒకటి తారసపడింది. ఆ మెట్ల మార్గం ద్వారా లోపలికి వెళ్లిన పోలీసులకు 15-25 ఏళ్ల వయస్సుగల ఐదుగురు పిల్లలతో పాటు మంచంపై ఓ 60ఏళ్ల వృద్ధుడు కనిపించాడు. దీంతో పోలీసులు అతన్ని విచారించారు. పిల్లలను కూడా పలు ప్రశ్నలు అడిగారు.

అయితే వారికి తల్లి ఎవరో తెలియదని, ఆ ముసలి వ్యక్తినే తండ్రిగా భావిస్తున్నారని పోలీసులు తెలిపారు. పిల్లలు ఎంత కాలంగా సెల్లార్ లో జీవిస్తున్నారో కూడా వారు చెప్పలేకపోయాడు. పిల్లలు ఎప్పుడు బయటకు రానిచ్చేవాడు కాదని, అతనితో పాటు వారు ఆ ఇంట్లో ఉంటున్నారని చెప్పారు. పిల్లలు అతనితో కలిసి సొంతంగా కూరగాయలు పండిస్తూ మేక పాలతో జీవితాన్ని గడుపుతున్నారు. వీరు పండించే పొలం ఓ వ్యక్తి వద్ద కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories