మేఘాల్లో మంచు ఇలాగే తయారవుతుంది

మేఘాల్లో మంచు ఇలాగే తయారవుతుంది
x
Highlights

మేఘాల్లో మంచు ఏ విధంగా పుట్టిందన్న మిస్టరీని కొంత మంది శస్త్రవేత్తలు కనిపెట్టారు.

ఆకాశంలో కదిలే మేఘాలు తెల్లగా పాల నురగలా వెలుతుంటే ఎంతో అందంగా కినిపిస్తాయి. అప్పుడప్పుడు వింత ఆకారాలతో కూడా ఈ మేఘాలు కనిపిస్తుంటాయి. ఇంత అందమైన మేఘాలు, మేఘాల్లో మంచు ఏవిధంగా పుట్టాయి అన్న విషయం ఇప్పటి వరకూ ఎవరికైనా తెలుసా తెలీదు కదా.

ఈ మేఘాలు, మేఘాల్లో మంచు ఏ విధంగా పుట్టిందన్న మిస్టరీని కొంత మంది శస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ రహస్యాలను కనిపెట్టేందుకు ఎన్నో ఏళ్లుగా జర్మనీలోని 'లీబ్నిజ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రోపోఫెరిక్ రీసెర్చ్' శాస్త్రవేత్తలు పరిశోధనలను చేసారు. నిట్టనిలువుగా వీచే గాలులే మంచు తయారవడానికి కారణమని స్పష్టం చేశారు. మేఘాల్లో నీటి ఆవిరితోపాటు చల్లని ద్రవరూప సూక్ష్మబిందువులు, వేడి గాలి, చల్ల గాలి, మంచుకణాలు ఉంటాయని వారు తెలిపారు.

ఈ విధంగా అన్నీ కలిసున్న మేఘాలను 'మిశ్రమ దశ మేఘాలు' అని పిలుస్తారని తెలిపారు. అయితే చల్ల గాలితో పోల్చుకుంటే వేడి గాలుల సాంద్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి వేడి గాలులు పైకి వెళ్లే సమయంలో ఈ మిశ్రమ దశ మేఘాలు కుదుపులకు గురవుతాయని తెలిపారు. ఈ క్రమంలోనే మంచుకణాలు అన్నీ కలిసిపోయి మంచు తయారవుతున్నట్టు లీబ్నిజ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రోపోఫెరిక్ రీసెర్చ్' శాస్త్రవేత్తలు తేల్చారు. లేజర్, రాడార్ టెక్నాలజీతో దీన్ని అధ్యయనం చేసి మంచు తయారు కావడానికి నిట్టనిలువుగా వీచే గాలులే కారణమని వారు స్పష్టం చేశారు. ఈ నిట్టనిలువు గాలులు ఎంత ఎక్కువగా కుదిపేస్తే అంత ఎక్కువ మొత్తంలో మంచు తయారవుతుందని తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories