Shahzadi Khan Executed in UAE: ఈ భారతీయ మహిళకు ఎందుకు మరణ శిక్ష అమలు చేశారు?

Shahzadi Khan, a woman from Uttar Pradesh in india executed in UAE in 4 months old boy death case
x

Shahzadi Khan Executed in UAE: ఈ భారతీయ మహిళకు ఎందుకు మరణ శిక్ష అమలు చేశారు?

Highlights

Indian woman executed in UAE: ఫిబ్రవరి 28న యూఏఈలో ఉన్న రాయభార కార్యాలయానికి షాహజాదీ ఖాన్ మరణ శిక్ష అమలు గురించి

Shahzadi Khan executed in UAE: యూఏఈలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన షహజాదీ ఖాన్ అనే మహిళకు అక్కడి ప్రభుత్వం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 4 నెలల చిన్నారిని హత్య చేశారనే కేసులో యూఏఈ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ఫిబ్రవరి 15న ఆమెకు మరణ శిక్షను అమలు చేశారు. మార్చి 5న ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. షహజాదీ ఖాన్ స్వస్థలం యూపీలోని బాందా జిల్లా.

షహజాదీ ఖాన్ తండ్రి షబ్బీర్ ఖాన్ తన కూతురి మరణ శిక్ష లీగల్ స్టేటస్ ఏంటి, ప్రస్తుతం ఆమె ఎలా ఉన్నారు అని తెలుసుకునేందుకు ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. దాంతో ఢిల్లీ హై కోర్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా ఆమె వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించింది. అలా తెలుసుకునే క్రమంలోనే షహజాదీ ఖాన్‌కు మరణ శిక్షను అమలు చేశారనే విషయం బయటికొచ్చింది.

ఫిబ్రవరి 28న యూఏఈలో ఉన్న రాయభార కార్యాలయానికి షహజాదీ ఖాన్ మరణ శిక్ష అమలు గురించి అధికారిక సమాచారం అందింది. ఆ తరువాత ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ఢిల్లీ హై కోర్టుకు వెల్లడించింది. ఈ సమాచారం అందుకున్న హై కోర్టు... షహజాదీ మరణం బాధాకరం అంటూ ఈ పిటిషన్‌ను కొట్టేసింది.

షహజాదీ ఖాన్ కేసు ఏంటి?

2021 డిసెంబర్‌లో షహజాదీ ఖాన్ అధికారికంగా వీసాపై యూఏఈ వెళ్లారు. ఆమె ఒక చోట పనికి కుదిరారు. 2022 ఆగస్టులో ఆమెకు పని ఇచ్చిన యజమానికి ఒక బాబు పుట్టారు. అప్పటి నుండి షహజాదీ ఖాన్‌ను ఆ బాబుకు సంరక్షకురాలిగా నియమించారు. అదే ఏడాది డిసెంబర్ 7న రెగ్యులర్ టీకాల అనంతరం ఆ బాబు చనిపోయారు.

బాబు మృతికి షహజాదీ ఖాన్ కారణం అంటూ ఆమె యజమాని కుటుంబం కేసు పెట్టింది. 2023 డిసెంబర్‌లో షహజాదీ ఖాన్ తన నేరాన్ని ఒప్పుకున్నట్లుగా ఒక వీడియో కూడా బయటికి వచ్చింది. అయితే, ఆమె ఆ నేరం ఒప్పుకునేలా యజమాని కుటుంబం చిత్రహింసలకు గురిచేసిందనే ఆరోపణలు కూడా వినిపించాయి. అంతేకాదు... ఆ బాబు శవానికి పోస్టుమార్టం చేసేందుకు కానీ లేదా ఈ కేసులో మరింత లోతైన విచారణ జరిపేందుకు కానీ ఆ కుటుంబం ఒప్పుకోలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి.

యూఏఈలో ఉన్న భారత రాయబార కార్యాలయం ద్వారా తన కూతురుకి అవసరమైన న్యాయ సహాయం ఇప్పించేందుకు ప్రయత్నించాం. కానీ అంతలోనే ఆమె నేరం ఒప్పుకోవాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చారంటూ షబ్బీర్ ఖాన్ వాపోయారు. 2024 మే నెలలో క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నామని, అయినప్పటికీ తన కూతురిని బతికించుకోలేకపోయానని తెలిపారు. ఉపాధి కోసం విదేశానికి వెళ్లిన తన కూతురు ఇక ఎప్పటికీ తిరిగి రాదని తెలిసి ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది.

Also watch this video: Nimisha Priya: యెమెన్‌లో మరణశిక్ష నుంచి ఈ భారతీయ నర్సు తప్పించుకోగలరా?

Also watch this video: Countries with More Women Than Men: ఈ దేశాల్లో మగాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ

Show Full Article
Print Article
Next Story
More Stories