US: అమెరికాలో కాల్పుల కలకలం..11 మందికి గాయాలు

Several people were injured in a mass shooting in the South Carolina beach town telugu news
x

 US: అమెరికాలో కాల్పుల కలకలం..11 మందికి గాయాలు

Highlights

US: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నార్త్ కరోలినాలోని ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. లిటిర్ రివర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 9.30గంటల సమయంలో...

US: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నార్త్ కరోలినాలోని ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. లిటిర్ రివర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 9.30గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. దీంతో ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ దాడిలో 11 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించినట్లు హారీ కౌంటీ పోలీసులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర విభాగాలు ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలను చేపట్టాయి. భారీ సంఖ్యల అంబులెన్స్ లు అక్కడికి చేరాయి. నివాస సముదాయాల మధ్య ఎవరు కాల్పులు జరిపారనే విషయాలు మాత్రం తెలియరాలేదు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.

కాగా ఈ మధ్యే సౌత్ కరోలినాలో అరాచకశక్తుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గత నెలలో ఇదే విధంగా దక్షిణ కరోలినాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన మిర్టిల్ బీచ్ లో దుండుగులు కాల్పులకు పాల్పడటంతో ఓ వ్యక్తి మరణించాడు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ఘటనలో నార్త్ ఓషన్ బౌలేవార్డ లో ఓ వ్యక్తి ప్రజలపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అతను మరణించినట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories