Donald Trump: అభిసంశన ఆరోపణల్లో నిర్దోషిగా బయటపడిన ట్రంప్

Donald Trump: అభిసంశన ఆరోపణల్లో నిర్దోషిగా బయటపడిన ట్రంప్
x
Highlights

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఊరట లభించింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఉక్రెయిన్ మీద ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలకు సంబంధించి ట్రంప్ మీద ప్రతినిధుల...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఊరట లభించింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఉక్రెయిన్ మీద ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలకు సంబంధించి ట్రంప్ మీద ప్రతినిధుల సభ అభిశంసన విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అభిశంసనను ప్రతినిధుల సభ ఆమోదించగా.. తాజాగా సెనేట్ లో మాత్రం ఈ తీర్మానం వీగిపోయింది. డొనాల్డ్ ట్రంప్‌ను నిర్దోషిగా ప్రకటించాలని సెనేట్ బుధవారం ఓటు వేసింది.

మొత్తం 53 మంది రిపబ్లికన్లు అధ్యక్షుడిని నిర్దోషిగా ప్రకటించగా.. 45 మంది డెమొక్రాట్లు మరియు ఇద్దరు స్వతంత్రులతో కలిసి ట్రంప్‌ను దోషిగా భావించి ఓటు వేసింది. కాని అధ్యక్షుడిని తొలగించడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీకి ఇది చాలా తక్కువ అని కార్యాలయం వెల్లడించింది.

దోషిగా తేల్చేందుకు అవసరమైన మూడింట రెండు వంతుల సూపర్ మెజారిటీ కంటే చాలా తక్కువగా ఓట్లు రావడంతో ట్రంప్ నిర్దోషిగా బయటపడ్డాడని వైట్ హౌస్ స్పష్టం చేసింది.

మూడింట రెండొంతుల మంది సెనేటర్లు అతన్ని దోషిగా ప్రకటించలేదని, అభియోగాలు మోపబడినట్లు ట్రంప్ దోషి కాదని విచారణకు అధ్యక్షత వహించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ అన్నారు.

మొత్తం 53 మంది రిపబ్లికన్లు అధ్యక్షుడిని నిర్దోషిగా ప్రకటించారు.. అలాగే ప్రతి డెమొక్రాట్ మరియు ఇద్దరు స్వతంత్రులు దోషులుగా ఓటు వేసినా చివరకు ఐదు ఓట్లతో ట్రంప్ పైచేయి సాధించినట్టయింది. దాంతో ట్రంప్ అభిశంసన తీర్మానం వీగిపోయింది.

2020 అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ట్రంప్ తన ప్రత్యర్థిని ఇరుకునపెట్టేందుకు ఉక్రెయిన్ నుండి అక్రమంగా సహాయం కోరినందుకు ఆయనను పదవి నుండి బహిష్కరించేందు విపక్షం చేసిన ప్రయత్నాన్ని ట్రంప్ తిప్పికొట్టారు.

78 రోజుల దర్యాప్తు అనంతరం ట్రంప్ నిర్దోషిగా బయటపడటంతో రిపబ్లికన్ల ఆనందానికి అవధుల్లేవు. మరోవైపు ట్రంప్ ను పదవీచ్యుతుడ్ని చెయ్యాలని డెమొక్రాట్లు వేసిన పాచిక పారలేదు. దీంతో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లో ట్రంప్ మరోసారి ఎన్నిక కావాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories