సౌదీ అరేబియా స్పేస్ మిషన్‌లో లింగ సమానత్వం.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి మహిళా వ్యోమగామి

Saudi Arabia To Send Its First Female Astronaut Into Space
x

సౌదీ అరేబియా స్పేస్ మిషన్‌లో లింగ సమానత్వం.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి మహిళా వ్యోమగామి

Highlights

*AX-2 స్పేస్ మిషన్ సిబ్బందిలో చేరుతున్న రేయానా బర్నావి

Saudi Arabia Space Mission: సౌదీ అరేబియా సర్కార్ లింగ సమానత్వానికి పెద్దపీట వేస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి మహిళా వ్యోమగామిని ఎంపికచేసింది. తమ తొలి మహిళా వ్యోమగామి, పురుష వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఈ మిషన్ చేపట్టనుంది. వ్యోమగాములు రేయానా బర్నావి, అలీ అల్కార్నీ AX-2 స్పేస్ మిషన్ సిబ్బందిలో చేరతారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకునేందుకు యాక్సియమ్ స్పేస్ చేపడుతున్న రెండో పూర్తి ప్రైవేట్ వ్యోమగామి మిషన్ ఇదే.

మానవ జాతికి సేవ చేయడం, అంతరిక్షం అందించే ప్రయోజనాలు పొందడం కోసం మానవ అంతరిక్షయానంలో సౌదీ సామర్థ్యాలను బలోపేతం చేయడం ఈ మిషన్ లక్ష్యం. అమెరికా నుంచి ఈ మిషన్ ప్రారంభం కానుంది. సౌదీ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మరో ఇద్దరు వ్యోమగాములు మరియం ఫర్దౌస్, అలీ అల్గామ్డిలకు కూడా శిక్షణ ఇస్తున్నారు. సౌది చేపడుతున్న ఈ అంతరిక్ష యాత్ర చారిత్రాత్మకమైనది. ఒకే దేశానికి చెందిన ఇద్దరు వ్యోమగాములను ఒకేసారి I.S.S.కు తీసుకెళ్లిన ప్రపంచంలోని అది కొద్ది దేశాల్లో సౌదీ ఒకటిగా నిలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories